వాహనంని “నిమ్మకాయ” తొక్కించడం వెనక అసలు కథ ఇదే.! తెలియక ఇన్ని రోజులు గుడ్డిగా పాటిస్తున్నామా.?

వాహనంని “నిమ్మకాయ” తొక్కించడం వెనక అసలు కథ ఇదే.! తెలియక ఇన్ని రోజులు గుడ్డిగా పాటిస్తున్నామా.?

by Mohana Priya

Ads

మనం ఎన్నో పద్ధతులను పాటిస్తాం. అందులో కొన్ని పద్ధతులు పాటించడానికి వెనుక ఉన్న కారణం మనకు తెలియకపోవచ్చు. మనం ఏదైనా కొత్త వెహికల్ కొంటే, ముందు చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి పోనిచ్చిన తర్వాత బండి వాడడం మొదలు పెడతాము. ఇలా చేయడానికి వెనకాల ఉన్న కారణం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. అసలు అలా కొత్త వాహనం కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

పూర్వకాలంలో మనకి ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు ఉండేవి. ఎడ్లు, గుర్రాలు అనేక ప్రదేశాల్లో నడిచేవి. దారిలో రాళ్ళు, రప్పలు, బురద ఇలా ఎన్నో ఎదురవుతాయి. వాటన్నిటి మీద ఇవి నడుస్తాయి. అలా నడుస్తున్నప్పుడు కాళ్లలో ఏవైనా గుచ్చుకొని పుండ్లు పడతాయి. ఆ కాళ్ళ మీద బురద పడితే ఇన్ఫెక్షన్ అయ్యి పురుగులు వస్తాయి.

పురుగులు పడితే బండి సరిగ్గా నడవదు. బండి బాగా నడవడం కోసం, ఎడ్ల చేత, గుర్రాల చేత నిమ్మకాయలు తొక్కించే వారు. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ పుండులో ఉన్న బ్యాక్టీరియాను చంపుతుంది. పూర్వకాలం వాళ్లు వెళ్తూ వెళ్తూ బండిని నిమ్మకాయ పైకి ఎక్కించండి అని చెప్పారు. మనం కూడా ఆ పద్ధతిని పాటిస్తున్నాం.

కానీ వాళ్లు ఎడ్ల బండిని, లేదా గుర్రపు బండిని ఉద్దేశించి చెప్పారు. కానీ మనం మాత్రం మామూలు వాహనాలకి కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నాం. అంటే రబ్బర్ టైర్లను కూడా నిమ్మకాయ మీదకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు తెలిసిందా వాహనాలను నిమ్మకాయల మీద నుంచి ఎందుకు పోనిస్తారో ?

watch video:


End of Article

You may also like