30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి టాలీవుడ్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆయన శ్రీహరి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. శ్రీహరి భౌతికం గా మన మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో మాత్రం కొలువై ఉన్నాడు. రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో శ్రీహరి… రియల్ లైఫ్ లో కూడా హీరో గానే ఉండేవారు.

prudhvi

ఆయన చేసిన గుప్త దానాలు కోకొల్లలు. ఆయన ఇంట్లో ఉన్న సమయం లో ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి నుంచుంటే.. ఆయన గుడ్డలో రాయి పెట్టి డబ్బులు ఉంచి.. ఉండలా చుట్టి వారి వద్దకు విసిరేసేవారని కమెడియన్ పృథ్వి చెప్పుకొచ్చారు. వారు ఆ గుడ్డను తీసి చూసుకుని ఆయనకు దణ్ణం పెట్టేవారన్నారు. ఇలాంటి గుప్త దానాలు శ్రీహరి చాలానే చేశారని పృథ్వి చెప్పుకొచ్చారు.