భార్య భర్తల మధ్య అన్యోన్యత ఏర్పడాలంటే బెడ్రూంలో కిటికీ ఉండాలి. కిటికీ లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. కనుక బెడ్ రూమ్ లో తప్పక కిటికీ ఉండేటట్లు చూసుకోండి.
1దీంతో ప్రేమానురాగాలు వస్తాయి.అలానే బెడ్ రూమ్ లో ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ సామాన్లను పెట్టుకోకూడదు.
ఎలక్ట్రానిక్ సామాన్లు పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడతాయి.
1. అదే విధంగా బెడ్ రూమ్ లో పింక్ కలర్, గ్రీన్ కలర్ కానీ పెయింట్ వేస్తే మంచిది. దీని వల్ల చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్లో మొక్కలను పెంచుతున్నారు. అయితే ఇంట్లో మొక్కలు పెట్టేటప్పుడు ముళ్ల మొక్కలు లేకుండా చూసుకోండి. ముళ్ళ మొక్కల వల్ల ఇబ్బందులు వస్తాయి.
బెడ్ రూమ్ లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచి కలుగుతుంది.
బెడ్ రూమ్ లో ఎప్పుడు కూడా దేవ దేవతల ఫోటోలు పెట్టకూడదు. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.