మీరు అర్ధరాత్రి ట్రైన్ ఎక్కాల్సి ఉంటె.. ఆ టైం లో ట్రైన్ డోర్ లోపలి వైపు నుంచి లాక్ చేసుకుని ఉంటె ఏమి చేయాలి..?

రైలు ప్రయాణం అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. హాయిగా విండో సీట్ దొరికితే.. మొబైల్ లో కావాల్సినంత ఛార్జింగ్ ఉంటె.. ఎంత దూరం అయినా వెళ్లిపోవడానికి ఇష్టపడేవాళ్లు ఉంటారు.

దూర ప్రయాణాలలో ఎక్కువ కంఫర్ట్ తో ప్రయాణించాలి అని అనుకునే వారు ఎక్కువ గా రైలు ప్రయాణాలనే ఎంచుకుంటూ ఉంటారు.

అయితే.. మనలో చాలా మంది రాత్రిపూట ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అర్ధరాత్రి టైం లో కూడా ట్రైన్ ఎక్కాల్సి రావచ్చు. సాధారణం గా ఆ టైం లో ట్రైన్ లో అందరు నిద్ర లో ఉంటారు.

టికెట్ కలెక్టర్లు (TTE) కూడా ట్రైన్ లో వారి ప్లేస్ లోకి వెళ్ళిపోతారు. ఆ టైం లో ట్రైన్ లోపల ఉండే ప్రయాణికులు భద్రత కోసం డోర్ ను లోపల వైపు నుంచి లాక్ చేసుకుని ఉంటారు.

మరి అలాంటి టైం లో లోపలకు స్టేషన్ లో ట్రైన్ ఆగినప్పుడు లోపలకి వెళ్ళాలి అంటే ఎలా..? ఆ టైం లో మనం పిలిచినా లోపల ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా..?

ఏ స్టేషన్ లో ఏ బోగీలో ప్రయాణికుడు ఎక్కాలి అన్న సమాచారం ముందే తెలుస్తుంది కాబట్టి.. అర్ధరాత్రి టైం లో అయినా.. ఆ బోగి వద్దకు వచ్చి ఉంటాడు. కాబట్టి ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు.