ఇతరులను మన దారిలోకి తెచ్చుకోడానికి చాణుక్యుడు చెప్పిన  ట్రిక్స్ ఇవే.!

కొందరు మూర్ఖులు ఉంటారు. తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు వీరి వ్యవహార ధోరణి ఉంటుంది. ఇలాంటి వారిని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి

వారు ఏది చేస్తే అది ఫాలో అవ్వాలి. అలా చేస్తూ ఉంటె.. కొంతకాలానికి వారే మీ కంట్రోల్ లోకి వచ్చేస్తారు.

అలాగే.. కొందరేమో కోపిష్టి స్వభావం కలిగి ఉంటారు. వారి పట్ల మర్యాద గా ప్రవర్తించాలి. ప్రశాంతం గా మాట్లాడాలి. ఎల్లపుడు వారి పట్ల కోపం గా ఉంటె.. వీరితో సఖ్యత కుదరడం కష్టం.

అందుకే వారిపట్ల మర్యాదగా ప్రవర్తిస్తే.. వారు కొంత కూల్ అయ్యి మీతో ఫ్రెండ్లీ గా ఉంటారు.

అవతలి వారు మీకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారు అయితే.. టాలెంట్ ఉన్న వారు అయితే.. వారి పట్ల మీరు నిజాయితీ గా ఉండడం ఉత్తమం. అప్పుడు వారికి మీ పట్ల ఆసక్తి కలిగి మీ దారిలోకి నడుస్తారు.