మన సమాజంలో చాలా మారాయి. అలాగే మారనివి కూడా చాలా ఉన్నాయి. అందులో డ్రెస్ సెన్స్ ని బట్టి జనాలని జడ్జ్ చేయడం ఒకటి. ఇప్పుడు కూడా చాలా మంది వేరే వాళ్లు వేసుకున్న దుస్తులను బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే విషయాన్ని ఒక అంచనా వేస్తారు. ఇది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ వరకు ఉంచుకుంటే బానే ఉంటుంది.

కానీ చాలా మంది అవతలి వాళ్లు ఏమనుకుంటారు అని కూడా పట్టించుకోకుండా వాళ్లు వేసుకున్న డ్రెస్ పై కామెంట్ చేస్తారు. మళ్లీ ఏమైనా అంటే, “వాళ్లు అలా డ్రెస్ చేసుకున్నారు కాబట్టి మేము ఇలా కామెంట్ చేశాం” అని అంటారు. ఇదే విషయాన్ని కోరా లో ఒక వ్యక్తి ఈ విధంగా అడిగారు. ” మీరు ఎప్పుడైనా మీరు వేసుకున్న దుస్తులపై వేరే వాళ్ల కామెంట్ వల్ల అఫెండ్ అయ్యారా (మనస్తాపం చెందారా)? ఒకవేళ అయితే, ఎలాంటి ఏంటి డ్రెస్ వేసుకున్నారు?” అని అర్థం వచ్చేలాగా అడిగారు.

source: quora

దీనికి ఆకాషి చౌహన్ ఈ విధంగా రిప్లై ఇచ్చారు “నేను అసలు ఊహించని విధంగా కామెంట్ ఎదుర్కున్న రోజు ఫోటో ఇది. నాకు తెలిసి మీలో ఎవరు ఈ దుస్తులలో ఏం తప్పు ఉందో గుర్తించలేరు. నేను చెప్తాను. ఇది మేము ఒక ఆలయంలో ‘భండారా’ (పేద ప్రజలకు ఉచిత ఆహారం) నిర్వహించే సందర్భంలోనిది. ఆ రోజు మా బంధువు (అంకుల్) నాతో ఈ విధంగా అన్నారు.

“నీకు సిగ్గు లేదా? ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, లిప్ స్టిక్, బొట్టు ఎందుకు పెట్టుకున్నావు? నీకు పెళ్లి కాలేదు కాబట్టి ఇలాంటివన్నీ వేసుకోకూడదు. పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఉన్నావా?” అని అన్నారు. నేను ఆయన అడిగిన ప్రశ్నకి స్పందించలేదు. కానీ నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.

నాకు తెలుసు. నేను ఒక వేళ షార్ట్ డ్రెస్ వేసుకున్నా కూడా, ఇదే వ్యక్తి వచ్చి నన్ను జడ్జ్ చేస్తారు. సందర్భానికి తగ్గట్టుగా నేను ఇండియన్ డ్రస్ లో ఉన్నా కూడా, ఏదో ఒక రకంగా కామెంట్ చేయడానికి దారి వెతుకుతారు. నేను ఇలాంటి పరిస్థితులను చాలా సార్లు ఎదుర్కొన్నాను. కానీ అందులో ఇది మాత్రం చాలా ఇబ్బందికరమైనది” అని జవాబిచ్చారు.

source : quora


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com