చాలా మంది నోటి నుండి ఎక్కువగా వినిపించే మాట ఒక్కటే. “ఇప్పటి రోజుల్లో మానవత్వానికి విలువ లేదు”. ఈ మాట కొంత వరకు నిజమే అయినా కూడా ఎంతో మంది తమకు తోచిన సహాయం చేస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి ఎంతో మంది ప్రముఖులు వారికి సహాయం చేయడానికి చేయి అందిస్తున్నారు.

Anand Mahindra help to idli Amma

వివరాల్లోకి వెళితే. చెన్నైలో ఒక పెద్దావిడ కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతారు. ఎన్నో సంవత్సరాల నుండి ఆవిడ ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. ఆ పెద్దావిడ పేరు కమలతల్. కమలతల్ చేస్తున్న ఈ సేవ సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ అయ్యింది. విషయం బాగా వైరల్ అవడంతో ప్రముఖుల వరకు కూడా వెళ్ళింది.

వారిలో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా కమలతల్ కి తన వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్రా ఈ విధంగా తెలిపారు “ఒకరి స్పూర్తినిచ్చే కథలో వేరొకరు పాత్ర పోషించడం అనేది చాలా అరుదుగా దక్కే అవకాశం.

Anand Mahindra help to idli Amma

మాకు ఈ పాత్ర పోషించే అవకాశం ఇచ్చినందుకు ఇడ్లీ అమ్మ గా పిలువబడే కమలతల్ కి నేను థాంక్స్ చెప్తున్నాను. ఆవిడ ఇడ్లీలు చేయడానికి అలాగే అమ్మడానికి ఒక చోటుని తొందరలోనే మేము ఏర్పాటు చేస్తాం. తక్కువ సమయంలోనే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఈ పనికి మాకు సహకరించిన తొండముతుల్ లోని రిజిస్టర్ ఆఫీస్ కి చాలా థ్యాంక్స్”అని ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా.

Anand Mahindra help to idli Amma