ఒరేయ్ తింగరి వెధవ , వెనక్కి ముందుకు చూస్కోకు నిన్నే .. నన్ను తిట్టడానికి నువ్వెవరు అని అనుకుంటున్నావా? నిన్నే కాదు , నీ పక్కన ఉన్నోన్ని, ఆ పక్కన ఉన్నోన్ని ఆ వెనక ఉన్నోన్ని ఎవడ్నైనా తిడతా , ఫేక్ న్యూస్ ప్రమోట్ చేస్తే .. ఏం రా ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించు అల్లం రసం తాగితే కరోనా దరిదాపుల్లోకి రాదా? పాపం అమెరికా, చైనాల్లో అల్లం లేదంటావా .. ప్రపంచ దేశాల్లోని డాక్టర్లకు తెలియదంటావా.. ఎందుకు రాత్రి పగలు కష్టపడుతున్నారంటావ్.

Video Advertisement

ప్రభుత్వాలెందుకు ఇన్నిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయంటావ్..ఇంటికో కేజి అల్లం పంపిణి చేస్తే అయిపోయే పనికి ఇంత కష్టం అవసరం అంటావా? ఒప్పుకుంటా అల్లం, వెల్లుల్లి,పసుపు మరియు మిరియాలు వీటిల్లో  ఔషద గుణాలుంటాయని , కానీ ప్రతి దానికి అదే మందు కాదురా . కాబట్టి శేర్ చేయడం ఆపు .. ఇదొక్కటే కాదు ఇంకా ఉన్నాయి..అందరి దగ్గరకి వస్తున్నా, అన్ని ఫేక్ న్యూసుల గురించి చెప్తా..

ఇళ్లల్లో ఉంటారా ? సింహాల్ని , పులుల్ని వదలమంటారా అని రష్యా అధ్యక్షుడు పుతిన్ అనౌన్స్ చేశాడట. ఏ దేశ అధ్యక్షుడైనా ఇంత తెలివి లేని పని చేస్తాడా ప్రజల్ని భయపెట్టడానికి .. సరే సరదాకి పంపారనుకుందాం. కొందరైతే ఏకంగా ఇదే నిజం అన్నట్టు ఫార్వర్డ్ చేసేశారు.

ఇప్పుడు ప్రపంచ జనాభా మొత్తం భవిష్యత్తు డాక్టర్ల చేతుల్లో ఉంది. అందుకని డాక్టర్లకు మనం చేయగలిగింది కేవలం వారి సేవల్ని అభినందిస్తూ చప్పట్ల కొట్టండి అని మోఢీ చెప్తే ..మనోళ్లు ఒక సూత్రం కనిపెట్టేసారు సౌండ్ చేస్తే కరోనా పారిపోతుంది అని గుంపులుగుంపులుగా మూగి పెద్ద పెద్దగా సౌండ్స్ చేశారు.. ఇండియాలో చదువుకున్న మూర్ఖులుంటారని ప్రపంచానికి మొత్తం నిరూపించారు.

ఆల్కహాల్ కిల్స్ కరోనా .. అదే నిజం అయితే అందరం ఎంచక్కా మందు కొడుతూ కూర్చోవచ్చు . మనకి ఆరోగ్యం ప్రభుత్వానికి ఆదాయం. ఇది ఫేక్ అంటే నమ్మే పరిస్థితి లేనంత మత్తులో ఉన్నారు జనం. కాని ఒకటి నిజం ఆల్కహాల్ కరోనాని చంపుతుందో లేదో కాని తాగినవాడికి మాత్రం బుర్రలో ఏం ఉండదు కాబట్టి కనీసం కరోనా టెన్షన్ అయినా లేకుండా ఉంటుంది.

అసలు సిసలైన వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్ ఇది మన దగ్గర ఎండలకి కరోనా వైరస్ తట్టుకోలేదు.. అసలు ఈ మెసేజ్ ఎవడు క్రియేట్ చేసాడో కాని చేతులెత్తి మొక్కాలి.. గమనించగలరు షేక్ హ్యాండ్ కాదు, మొక్కాలి.. ఒరేయ్ బాబు ఇప్పుడు ఎండలకి నువ్ పోయుంటావ్, వైరస్ మాత్రం నిక్షేపంగా ఉండి రోజురోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

మనిషి అనేవాడికి గాలి, నీరు ,నిద్ర, ఆహారం ఎంత అవసరమో సెక్స్ అవసరమే ఒప్పుకుంటా. కాని మోర్ సెక్స్  – మోర్ ఎనర్జి కిల్ కరోనా ..ఇదెక్కడి లాజిక్ రా..అసలు ఎలా వస్తాయిరా ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయాలని..కర్మ కర్మ..

ఈయన ఇండోనేషియా డాక్టర్ , కరోనా పేషెంట్స్ కి వైద్యం చేసి ఇతనికి కరోనా సోకింది తను చనిపోతాడని తెలిసాక ఒక్కసారి తన పిల్లల్ని , కడుపుతో ఉన్న భార్యని చివరిసారిగా చూసి చనిపోవాలనుకున్నాడు. అందుకే ఇంటి వరకు వచ్చి గేటు ఆవల నుండే తన కుటుంబాన్ని చూసుకుని వెళ్లిపోయాడు అంటూ ఒక ఫోటో వైరల్ అయింది.. ఎంత ఎమోషనల్ అయ్యాను రా ఈ మెసేజ్ చూసి కాని ఇది ఫేక్..అతనిది మలేషియా. అతను ఇప్పుడు నిక్షేపంగా ఉన్నాడు.

ఇటలీలో పరిస్థితి ఘోరంగా ఉన్న మాట నిజమే. కాని కుప్పలు కుప్పలుగా శవాల్ని తరలిస్తున్నారని వైరలవుతున్న వీడియో, న్యూస్ మాత్రం ఫేక్ . పాండమిక్ అనే సినిమాలో వీడియోని తీసుకొచ్చి ఇటలీ వీడియో అని వైరల్ చేసేసారు.

ఫ్రీ గా వస్తే ఫినాయిల్ అయినా తాగే వాళ్లకి ఈ మెసేజ్ చూడగానే వేయి ఏనుగుల బలం వచ్చేసుంటుంది. రూ.498కే లైఫ్ టైమ్ ప్లాన్ జియో అందిస్తుందని ఒక మెసేజ్ . కరోనా వచ్చి ఉంటామో ,పోతామో అని డౌట్ గా బతుకుతుంటే శవాల మీద పేలాలు ఏరుకునే వాడిలా లైఫ్ టైమ్ ప్లాన్ తో ఏం చేస్కుంటావురా.. జియో అలాంటి ప్లాన్స్ ఏం అందుబాటులోకి తీస్కురాలేదు. అనవసరంగా లింక్స్ క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లకు చిక్కకండి.

ఇటలీలో పిట్టల్లా రాలిపోయిన జనాల్ని చూడండి, మనం కూడా అలా రాలిపోవద్దంటే ఇళ్లల్లోనే ఉండండి.. ఇళ్లల్లోనే ఉండమని మంచి చెప్పావ్..మరి పిట్టల్లా రాలిపోయారని ఫోటో ఎక్కడిది..నేను చెప్తాను. అది ఆర్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రజలంతా నేలమీద పడుకున్న ఫోటో అది , అది తీసింది శాటిలైట్ కాదు రాయిటర్స్ సంస్థ.

ప్చ్.. నిజమే పాపం పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప బుక్స్ చదువుతూ చిన్న చిన్న పుస్తకాలను పట్టించుకోవట్లేదు.. ఇంటర్మీడియట్ బుక్లో ,ఫలానా పేజ్లో కరోనా గురించి రమేశ్ గుప్తా అనే డాక్టర్ ఎప్పుడో రాసాడు అంటూ ఒక మెసేజ్..ఒరేయ్ బాబు ఆయన రాసింది కరోనా వైరస్ గురించి, ఇది కరోనా కుటుంబానికి చెందిన నోవల్ కరోనా వైరస్ (కోవిడ్ -19). స్వయంగా WHO చెప్పినా పట్టించుకోని ప్రబుద్దులు వాట్సప్లో వచ్చేవి మాత్రం చాలా బుద్దిగా వింటారు.విధిగా శేర్ చేస్తారు.

ఇలాంటివి ఏవైనా రాగానే బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అంటూ కొందరొచ్చేస్తారు.. బ్రహ్మంగారిని, కాలజ్ణానాన్ని తప్పు పట్టట్లేదు. నిజంగా అప్పుడెప్పుడో చెప్తే అవన్నింటికి పరిష్కారాలు కూడా చెప్పుండాలి కదా.. సరే సమస్య చెప్పారు, మీరంతా సరిగ్గా ఆపద ముంచుకొచ్చాక కాకుండా ముందే చెప్తే జాగ్రత్తలు పడతాం కదా.. కాబట్టి ఈ సారి నుండి కొంచెం ముందు ఇన్ఫామ్ చేయండి బ్రదర్.

కన్నీరు పెట్టుకున్న ఇటలీ అధ్యక్షుడు అనే వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.,ఆ దేశంలో రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పెరుకుపోతున్న శవాలు,శవాలు పూడ్చడానికి స్థలాలు లేక అసలు వాళ్ళను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు అని.. అది చూడలేక ఆ దేశ అధ్యక్షుడే ఇక ఎవరిని కాపాడలేం అని చేతులెత్తేసి బోరున విలపించాడు అని వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫోటో వెనకున్న అసలు కథ ఏంటో చూద్దాము.ఆ ఫోటోలో ఉంది ఇటలీ అధ్యక్షుడు కాదు,తను బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో అనేది అసలు ట్విస్ట్.

brazil president

డిసెంబర్ 17,2019న బ్రెజిల్ లోని పలాసియో డో ప్లానాల్టోలో జరిగిన థాంక్స్ గివింగ్ కార్యక్రమంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో జైర్ ను ఓ దుండగుడు కత్తితో పొడిచి పారిపోయాడు ,వెంటనే జైర్‌ ని తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేర్చారు , ఆ సమయంలో జైర్ కు ఏడేళ్ల కూతురు తప్ప ఎవరు గుర్తురాలేదు అంట,నా ప్రాణం పోయినా పర్వాలేదు.. నా కూతురుని అనాథను చేయకండి అని మీడియా మీద భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి ఫొటోను కాస్త  ఇప్పుడు కరోనా వ్యాప్తి ని చూసి ఇటలీ అధ్యక్షుడు ఏడుస్తున్నారంటూ ఫేక్ వార్తలు రాసి సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఇటలీ ప్రెసిడెంట్ ఎవరో కింద ఫొటోలో చూడండి.

రేపటి నుంచి వైన్‌షాపులు ఓపెన్‌ చేస్తున్నారనే ఫేక్ న్యూస్ వాట్సాప్ లో ఫార్వార్డ్ అవుతుంది. ఏకంగా ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ డిపార్ట్‌మెంట్ పేరుతో ఓ ఫేక్‌ జీఓను తయారు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ న్యూస్ పై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఈ ఫేక్ మెసేజ్ సృష్టించిన వారికోసం దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ లు ఫార్వార్డ్ చేయకండి.


ఏంట్రా బాబూ రాస్తున్నా కొద్ద తరగట్లేదు..ఇవి మాత్రమే కాదు అపోలో డాక్టర్ ఆడియో, జెడి లక్ష్మీనారాయణ వాయిస్, అమీర్ ఖాన్ 250 కోట్లు ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే  రామాయణమహాభారతాల్లా ఒక గ్రంధం అయ్యేటట్టుంది.. కాబట్టి  మీకు ఒక మెసేజ్ రాగానే వెంటనే ఫార్వర్డ్ చేయకుండా ఒకసారి అదే ఫోన్లో గూగుల్ అనేది ఒకటుంటుంది ఫ్యాక్ట్ చెక్ చేస్కోండి..

చివరిగా చిన్నమాట చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతోడు స్మార్ట్ కాదు