బై బై చెప్పనున్నా మోడీ ..సోషల్ మీడియా లో వైరల్

బై బై చెప్పనున్నా మోడీ ..సోషల్ మీడియా లో వైరల్

by Megha Varna

ఒకప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా పిలవబడిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఫేస్ బుక్ లో అందరికన్నా అత్యధికంగా 4 కోట్ల 40 లక్షల ఫాలోవర్స్, ట్విట్టర్ లో 5 కోట్ల 33 లక్షల ఫాలోవర్స్, యూట్యూబ్ లో 30 లక్షల సబ్‌స్క్రైబర్లను ఉన్న మోడీ గారు ఇకపై తను సోషల్ మీడియాలో కొనసాగాలా వద్దా అనే నిర్ణయాన్ని వచ్చే ఆదివారం లోపు తీసుకుంటానని ప్రకటించారు.

Video Advertisement

దీనికి గల కారణాలను ఆయన ఇంకా వివరించనప్పటికీ ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లు, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల్ల ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఈ విషయంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో దానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


You may also like

Leave a Comment