ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అంటారు . కానీ ప్రస్తుతం సమాజంలో దానికి పూర్తి విరుధ్దంగా జరుగుతుంది. ప్రతి సెకనుకి ప్రపంచ నలుమూలల్లో ఎక్కడో ఒక చోట మహిళలు వేధింపులు ఎదుర్కొంటునే ఉన్నారు . ఎంతటి కఠినతరమైన చట్టాలు వచ్చినప్పటికి వేధింపులు ఆగకపోగా , ఆకతాయిలు మరింత హెచ్చుమీరుతున్నారు. తన నంబర్ ఇవ్వాలంటూ వేధిస్తున్న ఆకతాయిలకు కూర్చున్న చోటు నుండి కదలకుండా బుద్ది చెప్పింది ఒక మహిళ . ఎలాగో చదవండి.

ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల్లో ధైర్యాన్ని , పోలిసులంటే నమ్మకాన్ని కలిగిస్తుంది. అసలేం జరిగిదంటే ఒక మహిళ బస్సులో ప్రయాణిస్తుంది. తను కూర్చున్న సీటు వెనుక సీట్లో ఇద్దరు కుర్రాళ్లు కూర్చున్నారు . ఇద్దరు కుర్రాళ్లు ఆ అమ్మాయిని టీజ్ చేయడం స్టార్ట్ చేశారు . పేరు చెప్పమంటూ,ఫోన్ నంబర్ ఇవ్వమంటూ పదే పదే అడుగుతూ వేధించారు. సదరు మహిళ భయంతో బస్సులోనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా యూపీ పోలీసులకు ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ‘ఇది నా టికెట్.. బస్సు నెంబర్ అంటూ ఫొటో తీసి ట్వీట్‌కు యాడ్ చేసింది . ఆ అమ్మాయి చేసిన ట్వీట్ కి యుపి పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యారు.

యూపీలోని ఏదైనా 112 ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేయాల్సిందిగా కోరుతూ మహిళ ట్వీట్ కు పోలీసులు బదులిచ్చారు. ఆ తర్వాత తాను ప్రయాణించే బస్సు ఎక్కడ ఉందో కచ్చితమైన లొకేషన్ షేర్ చేయమని పోలీసులు మరో ట్వీట్ చేశారు. తన లొకేషన్ ని షేర్ చేసింది బాదిత మహిళ . వెంటనే మహిళ లొకేషన్‌తో పాటు అయోధ్య పోలీసు, బరబంకి పోలీసు ట్విట్టర్ అకౌంట్లను కూడా యూపీ పోలీసులు ట్యాగ్ చేశారు.

యూపీ పోలీసుల ట్వీట్లతో లోకల్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. బస్సు లొకేషన్ ని గుర్తించి , అక్కడికి చేరుకుని బస్ ని నిలిపివేశారు . ఏం జరుగుతుందో డ్రైవర్, కండక్టర్ మరియు ఇతర ప్రయాణికులకు తెలియక విస్తుపోయారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు మహిళ మరోసారి జరిగినదంతా వివరించింది. పోలీసులు ఆ ఇద్దరు యువకులను విచారించి, అరెస్ట్ చేశారు . యూపీ పోలీస్ కి థ్యాంక్యూ , వాళ్లిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ మరో ట్వీట్ చేసింది ఆ మహిళ .

సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది..ఆపదలో ఉన్నాను హెల్ప్ చేయండంటూ ట్వీట్ చేయగానే రెస్పాండ్ అయిన యుపి పోలీసులను నెటిజన్లు థాంక్స్ చెప్తు రిప్లై ట్వీట్స్ చేశారు. సోషల్ మీడియా , స్మార్ట్ ఫోన్ల ద్వారా హాని మాత్రమే కాదు , సరిగా వినియోగిస్తే ఇలాంటి ఉపయోగాలు కూడా ఉంటాయి అంటూ మరోసారి నిరూపితమైంది .









సంక్రాంతికి సూపర్ హిట్ అయిన చిత్రం “అల వైకుంఠపురంలో”…అల్లు అర్జున్ నటన, థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ డైరెక్షన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో ఎత్తు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో జరిగింది.ఈ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ “అల వైకుంఠపురములో సినిమా గురించి ఇప్పటికే చాలా చెప్పాము. కానీ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా కొన్ని చెప్పాలి. ఈ సినిమాని తన భుజం మీద మోసుకొచ్చాడు థమన్. విలువలతో సినిమా తీయండి. మేమెందుకు ఆదరించమో.. చూపిస్తాం అని మీరంతా చెప్పారు. అది మాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది.










హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం గమనార్హం. “తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ పైరసీని ప్లే చేసారు. వెంకీ కుడుముల, నితిన్ వెంటనే వీరిపై యాక్షన్ తీసుకోండి’ అంటూ ఆ బస్సు నెంబర్‌తో సహా ఫొటోలను షేర్ చేసాడు. దీనికి దర్శకుడు స్పందించి కేటీఆర్ కు ట్వీట్ చేసారు.

మాములు వ్యక్తిగా భావించిన అవ్వ “అయ్యా నా పేరు మంగమ్మ,నా వయసు 70 ఏళ్ళు ,రెండేండ్ల సుంది పింఛన్ వస్త లేదు బిడ్డా సారును కలుత్తమని వచ్చినా”ఆన్నది,అయితే ఆ అవ్వకు అయన ఎవరో తెలియదు. మాములు వ్యక్తిగా భావించిన ఆ అవ్వ తను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పింది..వెంటనే ఆ కలెక్టర్ డీఆర్డీవో పీడీ సుమతితో ఫోన్లో మాట్లాడి పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు.ఎంతో ఓపికగా ఆమె సమస్య విన్నది కలెక్టర్ గారే అని తెలుసుకుని చివరికి అవ్వ ఆశ్చర్యపోయింది.
కలెక్టర్ మంచితనాన్ని మెచ్చుకొని అతనిని చల్లగా ఉండాలంటూ ఆశిర్వదించింది అవ్వ.ఈ సన్నివేశం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.ఈ న్యూస్ లోకల్ మీడియాలో వైరల్ గా మారింది,మెట్లపై కూర్చొని వృద్ధురాలితో మాట్లాడుతున్నప్పటి కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలెక్టర్ పనితీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలాంటి కలెక్టర్ ప్రతి జిల్లాకు ఉండాలి అని కోరుకుంటున్నారు..తన హోదా ని మరిచిపోయి ఒక సాధారణ వ్యక్తి లాగా సహాయం చేసిన ఈ కలెక్టర్ ని మీరు కూడా అభినందిందండి,అందరికి షేర్ చేయండి.




ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై స్వీట్ షాపుల యజమానులు, మిఠాయి తయారీదారులు నాన్ ప్యాకేజ్డ్ స్వీట్స్ పై మ్యానుఫ్యాక్చర్ తేదీ , బెస్ట్ బిఫోర్ డేట్ కచ్చితంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ నిబంధన ప్యాకేజ్డ్ స్వీట్లకు మాత్రమే వర్తించేది. ఇకపై విడిగా లూజ్ గా అమ్మే స్వీట్స్ కి కూడా వర్తిస్తుంది. 2020 జూన్ 1 నుంచి ఈ కొత్త నిబంధలు అమల్లోకి రానుంది . చాలా వరకు షాపుల్లో ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన స్వీట్లను అమ్ముతున్నారని, దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ నిబంధనని తీసుకొచ్చారు.
