ప్రముఖ సూపర్ మార్ట్ కంపెనీ డీమార్ట్ అధినేత రాధాకిషన్ ఆస్తులు 2022వ సంవత్సరంలో గణనీయంగా తగ్గిపోయాయి. మార్చి 31 , 2022వ సంవత్సరం నాటికి రాధాకిషన్ దమానికు దాదాపు 14 లిస్టెడ్ కంపెనీలలో ఒక శాతం వాటా ఉంది. అయితే.. ఈ మొత్తం కలిపి కనీసం రూ. 1.55 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు సంపద 23 శాతం తక్కువగా ఉంది.
టివి 9 కథనం ప్రకారం.. డిసెంబర్ 31, 2021 నాటికి రూ. 2.02 లక్షల కోట్లుగా దమాని సంపద ప్రస్తుతం రూ. 1.55 లక్షల కోట్లుగా పడిపోయింది. అంటే మొత్తం ఆస్తులలో నాలుగోవంతు సంపద ఆవిరైపోయింది.
దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. దమాని పెట్టుబడిన కంపెనీలైన ట్రెంట్, ఇండియన్ సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, మెట్రోపొలిస్ హెల్త్ కేర్, 3 ఏఎమ్ ఇండియా, యునైటెడ్ బ్రూవరీస్, ఆస్టా మైక్రోవేవ్, సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్, మంగళం ఆర్గానిక్స్ వంటి కంపెనీలతో పాటు కొన్ని యితర కంపెనీల విలువ భారీగా పతనం అయిపొయింది. దీనితో దమాని ఆస్తుల విలువ కూడా తగ్గింది.
మరోవైపు దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలలో ప్రారంభం అయ్యాయి. గత సెషన్ లో సెన్సెక్స్ 54,252 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు 420 పాయింట్ల లాభంతో మొదలైంది. కాసేపటికి భారీ లాభాలనుంచి స్వల్ప లాభాల్లోకి పడిపోయాయి. అమెరికా మార్కెట్లు కూడా నిన్న లాభాల్లోనే ముగిసాయి.