జబర్దస్త్ తో నాగబాబు , రోజాలకి జన్మజన్మల సంబంధం అనేవాళ్లు. దానికి కారణాలు లేకపోలేదు షోలో కంటెస్టంట్స్ మారుతున్నా జడ్జిలుగా మాత్రం వీరిద్దరే. ఎన్నో షోస్ కి జడ్జిలుగా ఎందరో వచ్చి పోతున్నా ఈ షోకి మాత్రం జడ్జిలుగా వీరిద్దరే. జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్ ఇలా వారంలో రెండు సార్లు ప్రసారం అయ్యే షోలకి జడ్జిలు వీరిద్దరే. ఎలక్షన్స్ పేరుతో రోజా దూరం అయినా, అనారోగ్యం అని నాగబాబు దూరం తాత్కాలికమే. మళ్లీ ఆ చెయిర్స్ లో స్థానం వారిద్దరిదే .

అలాంటిది నాగబాబు ఉన్నట్టుండి షో నుండి తప్పుకున్నారు. అంతేకాదు మరొక ఛానెల్లో  అదిరింది అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. నాగబాబుతో పాటు జబర్దస్త్ డైరెక్టర్లు, ఆర్టిస్టులు కూడా అదిరింది షోకి క్యూ కట్టారు. ఇక్కడి టీం మొత్తం అక్కడ పని చేస్తున్నప్పటికి జబర్దస్త్ అంత హిట్ కాలేకపోతోంది.మరోవైపు జబర్దస్త్ పాత స్కిట్స్ ప్లే చేసుకుంటూ టిఆర్పి మాత్రం తగ్గనివ్వట్లేదు. ఇలాంటి తరుణంలో జబర్దస్త్ సరికొత్త ప్రోమోలో రోజా గారు మిస్ అయ్యారు.

కొందరు ఏమో ఆమె ఒక ఎపిసోడ్ మాత్రమే మిస్ అయ్యారు అంటున్నారు. మరికొందరు ఆమె జబర్దస్త్ లో మళ్లీ కనిపించరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం అనేది తెలీదు. తాజా ప్రోమోలో ఇద్దరు టీమ్ లీడర్లు బుల్లెట్ భాస్కర్, ఆసమ్ అప్పీ కొట్టుకుంటున్నట్లు చూపించారు. అది స్కిట్ లోని ఒక భాగమేనా? లేక నిజంగా కొట్టుకున్నారు? అనే అనుమానాలు వస్తున్నాయి జబర్దస్త్ అభిమానులకి. గతంలోకూడా టిఆర్పి కోసం ఇలాంటి స్టంట్ లు ఎన్నో వేశారు జబర్దస్త్ లో.

అప్పా రావు, భాస్కర్ చేసిన టిఆర్పి స్టంట్ నచ్చకే రోజా గారు జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. క్లారిటీ కావాలంటే వేచి ఉండాల్సిందే. గతంలో కూడా ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి. అలాంటి తరుణంలోనే వాస్తవం కాదు అనుకుంటే జబర్దస్త్ ను వదిలేసి నాగబాబు షాక్ ఇచ్చారు. మరి ఈ సారి ఏమవుతుందో?

If you want to contribute content on our website, click here

Cryptoknowmics Sharing is Caring:
No more articles