మంచిర్యాలలో దారుణమైన సంఘటన జరిగింది. ప్రేమ పేరుతో వివాహితను వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు బైక్ పై వెళ్తున్న యవకుడిని బండరాయితో బాది దారుణంగా కడతేర్చారు.
Video Advertisement
వివాహిత, ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు కలిసి తలను ఛిద్రమయ్యేలా రాయితో కొట్టడంతో ఆ యువకుడు అక్కడి కక్కడే కన్నుమూశాడు. ఈ దారుణ సంఘటన మంచిర్యాల జిల్లాలోని ఇందారం గ్రామంలో జరిగింది.
పట్టపగలు, అందరు చూస్తుండగా నడిరోడ్డు పై జరిగిన ఈ భయంకరమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. 28 ఏళ్ల మహేష్ అనే యువకుడు తమ కుమార్తెను వేధిస్తుండటం వల్ల ఆమె ఫ్యామిలీ మెంబర్స్ చంపినట్లు చెప్తున్నారు. ఈ సంఘటనను అక్కడే ఉన్నవారు వీడియో తీయడంతో బయటికి వచ్చింది. సంఘటన జరుగుతున్న స్థలంలో చుట్టూ జనం ఉన్నప్పటికి వారిలో ఒక్కరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. మహేష్ ను చంపడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ విషయం తెలియడంతో పోలీసులు వెంటనే ఘటనస్థలికి చేరుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి, మహేష్ గతంలో ప్రేమించుకోగా, యువతి తండ్రి ఈ విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ క్రమంలో మహేష్ యువతితో కలిసి దిగిన ఫోటోలు, మెసేజ్ లను ఆ యువతి భర్తకు పంపించాడు. వాటిని చూసిన ఆమె భర్త మనస్తాపానికి గురై ప్రాణం తీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన యువతి బంధువులు పలుసార్లు మహేష్ పై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు.
ఆ తరువాత కూడా మహేష్ అసభ్య పదజాలంతో మెసేజ్ ఆపకుండా పంపిస్తుండడంతో యువతి కుటుంబం పలు మార్లు మహేష్ ను హెచ్చరించింది. పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినప్పటికి అతను వేధింపులు ఆపలేదు. దీంతో సంఘటన జరిగిన ఉదయం మహేష్ బైక్ వెళ్తుండగా పథకం ప్రకారం అతని పై దాడి చేసి, రాయితో కొట్టి హత మార్చారు. పెళ్లైన మహిళను అసభ్య మెసేజ్‌లతో వేధిస్తుండటం వల్ల అతనిని హత మర్చినట్లు చెప్తున్నారు.
మహేష్ మృతదేహాంతో మహేష్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మహేష్ ను చంపిన యువతి కుటుంబ సభ్యుల పై కేసు నమోదు చేసి, శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు మహేష్ ను చంపిన ఐదుగురి పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు.
Also Read: ఉద్యోగం వదిలేసి వెళ్లిపోదాం అనుకున్నాడు… కానీ అంతలోనే..? ఏం జరిగిందంటే..?