Advertisement

“ఉయ్యాలా జంపాల” సినిమా ను ఇన్ని సార్లు చూసాం.. కానీ ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా..?

Advertisement

రాజ్ తరుణ్, అవికా గోర్ హీరో హీరోయిన్లు నటించిన సినిమా “ఉయ్యాలా జంపాల”. పల్లెటూర్లలో బావమరదళ్ళు ఎలా ఉంటారో ఈ సినిమా చూపించింది. వారి మధ్య ఉండే సరదా అల్లర్లు, ఆటపట్టిచ్చుకోవడాలు, వారి కుటుంబాల మధ్య జరిగిన గొడవ.. అన్ని సర్దుకుని చివరికి ఎలా కలుసుకున్నారనేదే ఈ సినిమా.

ఎంతో హృద్యం గా రూపొందించబడిన ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరిని బాగా ఆకట్టుకుంది. చిన్న సినిమా అయినా.. మంచి కంటెంట్ ఉండడం తో ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. అయితే.. ఒక సినిమా తీయడానికి దర్శక నిర్మాతలు ఎంతగానో కష్టపడతారు , అయినప్పటికీ.. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఈ సినిమా లో అవికాగోర్ కి హీరో ఫ్రెండ్ తో పెళ్లి ఫిక్స్ అవుతుంది కదా.. దానితో వారిద్దరూ అంత గా మాట్లాడుకోవడం మానేస్తారు. హీరోయిన్ మాత్రం హీరో తో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఓరోజు గుడికి తీసికెళ్ళమని హీరో ను అడుగుతుంది. తీరా గుడికి వెళ్ళాక.. వాళ్ళ అమ్మను అక్కడే వదిలేసి తనకు తలనొప్పి గా ఉందని.. ఇంటికి తీసుకెళ్ళిపోమని హీరో ని అడుగుతుంది. వీరిద్దరూ కార్ లో ఇంటికి వచ్చేస్తారు కదా. ఇది ఒక్క షాట్ లోనే పూర్తి అవ్వాల్సింది. కానీ.. ఏమి జరిగిందో ఏమో కానీ.. వారు గుడి నుంచి ఇంటికి మూడు కార్లలో ఇంటికి వస్తారు.

కావాలంటే.. ఆ సీన్ ను మళ్ళీ చూడండి మీకే అర్ధం అవుతుంది. మూడు రకాల స్టీరింగ్ లు కనపడతాయి. ఈ ఫోటోలను గమనించి చూడండి. దీనివలన సినిమాకి వచ్చే నష్టం ఏమి లేదు.. కాకపోతే ఒక్కోసారి ఇలా జరుగుతుంటాయంతే.


Advertisement
Advertisement