మా అమ్మ‌మ్మ సెక్స్ వ‌ర్క‌ర్ …మా అమ్మ కూడా…కాబ‌ట్టి నేను కూడా అదే వృత్తిలోకి వ‌చ్చేశాను.! ఈ చైన్ సిస్ట‌మ్ ను బ్రేక్ చేయాల‌నుకున్నాను. అందుకే త‌ల్లి కావొద్ద‌నుకున్నాను …కానీ ఎప్పుడు గ‌ర్భం దాల్చానో కూడా నాకు తెలియ‌దు.! నాకు తెలుసు ఓ సెక్స్ వ‌ర్క‌ర్ కూతురికి స‌మాజంలో ద‌క్కే గౌర‌వం ఏంటో .! పైగా ఏదిగిన కూతుర్ని ప‌క్క‌న పెట్టుకొని క‌స్ట‌మ‌ర్ల కోసం ఎదురుచూసే ఆ త‌ల్లి మ‌నోవేద‌న ఏంటో ?

Video Advertisement

ముందురోజు మా అమ్మ‌తో గ‌డిపిన విటుడే …మ‌రుస‌టి రోజు నాతో గ‌డిపిన ఆ రోజులు ఎంత న‌ర‌క‌మో కూడా నాకు తెలుసు. ఈ క్ర‌మంలోనే త‌ల్లిన‌య్యాను . ఆ కంపెనీ న‌డిపే ఓన‌ర్ …న‌న్ను అబార్ష‌న్ చేయించుకోమ‌న్న‌ది. ఎన్నో విధాలుగా ప్ర‌య‌త్నించింది. కొట్టించింది, క‌డ‌పులో త‌న్నించింది. విషం పెట్టాల‌ని కూడా చూసింది. అయినప్ప‌టికీ నా శ‌క్తినంతా కూడదీసుకొని మ‌రీ ఆ ప‌సిగుడ్డును బ‌తికించుకున్నాను.

నేను గ‌ర్భందాల్చిన‌ప్ప‌టి నుండి నేను దేవుడిని కోరుకున్నది ఒక్క‌టే…. అబ్బాయి పుట్టాలి.అప్పుడే …ఈ చైన్ బ్రేక్ అవుతుంది అనేది నా ఆలోచ‌న‌…పాపాత్ముల కోరిక‌లు ఆ దేవుడు కూడా ఓకే చెయ్య‌డు క‌దా…నాకూ కూతురే పుట్టింది. అందుకే …ఆ పాపిస్టి లోకం నుండి బ‌య‌టికొచ్చేశాను …రేప‌టి నా కూతురి భ‌విష్య‌త్ కోసం కొత్త వృత్తిని ఎంచుకున్నాను.