హీరో నాని సంచలన నిర్ణయం.. సినీ పరిశ్రమకు దూరం..?

హీరో నాని సంచలన నిర్ణయం.. సినీ పరిశ్రమకు దూరం..?

by Anudeep

Ads

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని గురించి పరిచయం అనవసరం. ఒక్కడే ఇండస్ట్రీ కి వచ్చి అంచెలంచలు గా ఎదిగి అభిమానాన్ని మూటగట్టుకున్నాడు. అయితే.. ఇటీవల నాని హీరో గా నటించిన “టక్ జగదీశ్” సినిమా ప్రమోషన్స్ లో భాగం గా థియేటర్స్ ను ఎంకరేజ్ చేయండి అంటూ నాని పిలుపునిచ్చారు. కానీ ఏమైందో తెలియదు “టక్ జగదీశ్” మాత్రం ఓటిటి లో రిలీజ్ అవుతోంది. ఈ క్రమం లో థియేటర్ యాజమాన్యాలు నాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Video Advertisement

nani

నాని సినిమాలను ఇక పై థియేటర్లలో విడుదల చేయబోము అంటూ పిలుపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లో నాని స్పందించారు. “టక్ జగదీశ్” విడుదల సమయం లో తనను ఓ బయటివాడిలా చూడడం ఎంతో బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. తన తదుపరి సినిమా థియేటర్ లో విడుదల కాకపోతే.. ఇక ఎవరో బ్యాన్ చేయడం కాదు.. నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా..” అంటూ ఆవేదన చెందారు.


End of Article

You may also like