గత ఆదివారం బెంగళూరులో జరిగిన సంఘటన పై వి కె నరేష్, పవిత్ర లోకేష్ రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ ను టార్గెట్ చేస్తూ మీడియా ముందు భర్త నరేష్ పైన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు . అంతేకాకుండా వాళ్ళిద్దరూ పై తీవ్రమైన విమర్శలు చేశారు.
గత పదేళ్లుగా నా భర్త నరేష్ తో పవిత్ర లోకేష్ సంబంధం పెట్టుకుంది. కేవలం ఆయన ఆస్తి కోసమే ఆయనతో రిలేషన్షిప్ కొనసాగిస్తుంది పవిత్ర. ఆ డబ్బు కోసమే మా ఇద్దరు భార్యాభర్తలను విడగొట్టింది. డబ్బు కోసమే ఆయను వలలో వేసుకొని పిచ్చివాడిలా తన చుట్టూ తిప్పుకుంటుంది అంటూ విమర్శించారు రమ్య రఘుపతి.
ఇద్దరూ కేవలం స్నేహితులు అయితే ఒకే గదిలో ఎందుకు ఉంటారు. బెంగళూరులో ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు నేను వాళ్లను పెట్టుకొనేసరికి నా ధైర్యాన్ని తట్టుకోలేక నరేష్ పిచ్చివాడిలా గెంతులు వేస్తూ విజిల్ వేసుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు అంటూ మీడియా ముందు ఘాటైన విమర్శలు చేసింది రమ్య.
నా భర్తతో నేను గత పదేళ్లుగా జీవితం గడుపుతున్నాను అతడు ఎలాంటివాడో, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో, అతని ఆలోచన ఎలా ఉంటాయో నాకు పూర్తిగా తెలుసు. నా భర్తే మంచివాడు అయితే నేను మరొకరిని ఎందుకు అనుమానిస్తాను. మూడో వ్యక్తిని విమర్శించాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది. ఏది ఎలా జరిగినా నా భర్త నాకు కావాల్సిందే, ఆయనకు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ రమ్య తెగేసి చెప్పారు.