పాపం బిడ్డ ఎంత కష్టం అనుభవించాడో, లేకపోతే మరీ ఇంతకి తెగిస్తాడా? ఫేక్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తేనే పోలీసులు తాట తీస్తుంటే ఏకంగా అర్దం పర్దం లేని రాతలతో గోడలపైకి పోస్టర్లెక్కించేస్తాడా? పోలీసులు ఊరుకుంటారా ? ఖచ్చితంగా ఊరుకోరు . ఎవరు చేశారు , ఎందుకు చేశారు అంతా కక్కిస్తారు.అప్పుడు మరో కొత్త ప్రాబ్లంలో ఇరుక్కోవడానికి కాకపోతే దేనికట ఇలాంటి తలతిక్క పనులు..ఇంతకీ ఏం చేశాడంటారా???

Video Advertisement

‘కొజ్జాలు, హిజ్రాలను దుకాణాల వద్దకు రానివ్వకండి. వారితో మాట్లాడినా, సెక్స్ చేసినా CORONA VIRUS వస్తుంది. వారిని తరిమి కొట్టండి (లేదా) డయల్‌ 100 కు ఫోన్‌ చేయండి. ప్రజలను CORONA VIRUS HIZRA’S నుండి కాపాడండి’అని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఇవే రకమైన పోస్టర్లు కర్ణాటక బస్టాండ్లలో కూడా కలకలం సృష్టించాయి . ఇదే విషయంపై ట్రాన్స్ జెండర్ల కార్యకర్త సంఘమిత్ర పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఎక్కడో  చైనాలో వచ్చిన కరోనావైరస్ వెనుక  అసలు కారణమేంటా అని శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటుంటే, మరోవైపు సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్లు ఇబ్బడి ముబ్బడిగా ఫార్వర్డ్ చేయబడుతున్నాయి. ఇప్పుడు ఇదొక కొత్త రచ్చ. ఇది ఖచ్చితంగా ఆకతాయిల పనే అది స్పష్టం అవుతోంది . రోజువారి జీవితంలో వాళ్ల వల్ల చిక్కులు ఎధుర్కొంటాం అనేది నిజమే కావచ్చు, దాంతో  వాళ్లని గట్టిగా ఒక మాట తిట్టలేం, వాళ్ల ఆగడాలని భరించలేం.. అంత మాత్రానా ఇంత పెద్ద నిందలు వేయాల్సిన అవసరం లేదు కదా.

నిజానికి వాళ్లు ఎదుర్కొంటున్న వివక్ష, భరిస్తున్న హింస కూడా తక్కువేం కాదు. అలాంటప్పుడు నిన్ను ఏదో ఇబ్బంది పెట్టారని ఇలాంటివి క్రియేట్ చేసి వాళ్లని బాధపెట్టాననుకుని సంబరపడడంలో అర్దం ఉందా?అసలింతకీ ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారన్నది ఇంకా తెలియలేదు. ఏదైతేనేమి ఆకతాయి పనులకి ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ దాటితే లేనిపోని చిక్కులు ఎదుర్కోకతప్పదు.ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు,కేసులు , కోర్టులు అని తిరగాల్సొస్తుంది. తస్మాత్ జాగ్రత్త!