బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఆ మధ్యకాలంలో పబ్ లో అయినా వివాదంతో వార్తలలో నిలిచాడు కాగా అంతటా ఈ విషయం గురించి చర్చనీయాంశం అయింది.అయితే ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కు పెళ్లి అయింది అనే వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది ..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

 

బిగ్ బాస్ షో లో రాహుల్ ,పునర్నవి జోడి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో అందరూ కూడా వీరు త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారు అని అనుకున్నారు.అదే విధంగా ఈ ఇద్దరు కూడా అప్పట్లో చాలా క్లోజ్ గా ఉండేవారు కానీ మా మధ్య ఉన్నదీ స్నేహం మాత్రమే అని ప్రేమ కాదు అని మేము పెళ్లి చేసుకోవట్లేదు అని క్లారిటీ ఇచ్చేసారు రాహుల్ ,పునర్నవి.రాహుల్ తల్లితండ్రులు కూడా రాహుల్ కి నచ్చిన అమ్మాయి అయితే చాలు అని మాకు తన వివాహ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవని ఇటీవల తెలిపారు.

 

అయితే తాజాగా రాహుల్ ,నోయెల్ మరియు ఇతర సింగెర్స్ రాహుల్ ఇంట్లో సమావేశం అయ్యి చిన్న పార్టీ సెలెబ్రేట్ చేసుకున్నారు.ఆ ఫోటోలను రాహుల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ హ్యాపీ టైం విత్ హ్యాపీ పీపుల్ అని రాసారు.అయితే దానికి నోయెల్ స్పందిస్తూ హ్యాపీ మారీడ్ లైఫ్ రాహుల్ అని కామెంట్ చేసారు.కాగా ఈ కామెంట్ సంచలనం గా మారింది.అసలు రాహుల్ కు ఎప్పుడు పెళ్లి అయింది ఆ అమ్మాయి ఎవరు అంటూ అందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.అయితే నోయెల్ సరదాగా పెట్టి ఉంటాడు అని కొంతమంది భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో అసలు ఈ విషయంపై రాహుల్ స్పందిస్తే గాని అసలు విషయం తెలిసేలా లేదు.

Sharing is Caring:
No more articles