సీనియర్ నటుడు నరేష్ పర్సనల్ టాపిక్ ఇప్పుడు పబ్లిక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నరేష్ నాలుగో పెళ్ళి ఇటు తెలుగు నాట, అటు కన్నడ చిత్రసీమలో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. ఇటు నరేష్, అటు పవిత్ర.. మధ్యలో నరేష్ మూడో భార్య రమ్య, పవిత్ర సహచరుడు సుచేంద్ర. తెరవెనుక కథను తెరపైకి తెస్తోన్న నాలుగు స్థంభాలాట గురించే ఇప్పుడు టాక్ అంతా.
తాజాగా ‘నటి పవిత్రా లోకేశ్ నా భార్యే. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను వివాహం చేసుకున్నాను. నా పాస్‌పోర్ట్, ఆధార్ కార్డును గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది’ అని కన్నడ నటుడు సుచేంద్రప్రసాద్ అన్నారు. పవిత్రా లోకేశ్, తాను భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు వెళ్లామని, కానీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోలేదని తెలిపారు. మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడం విదేశీ సంస్కృతికి నిదర్శనమని, అందుకే సర్టిఫికెట్ తీసుకోలేదని ఆయన తెలిపారు.
మరోవైపు రమ్య ఇదే విషయంపై స్పందిస్తూ.. తాను సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన అమ్మయినని ఎట్టి పరిస్థితుల్లోనూ విడకులకు అంగీకరించనని అన్నారు. తమ కొడుక్కి తండ్రి ప్రేమ, అండ కావాలని కనుక విడాకులు వద్దని అంటున్నాడని చెప్పారు. సంసారం అన్న తర్వత వివాదాలు వస్తాయని.. అంతమాత్రాన భార్య భర్తలు విడాకులు తీసుకోవడం సరికాదని ఆమె అన్నారు.