ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ఇటీవల కొన్ని విషయాల కారణంగా వార్తల్లో నిలిచారు. పవిత్ర లోకేష్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటీవలి కాలంలో విడుదలైన చాలా హిట్ సినిమాల్లో పవిత్ర లోకేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. దాంతో తెలుగు ప్రేక్షకుల్లో పవిత్ర లోకేష్ చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాల్లో కూడా పవిత్ర లోకేష్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాలో కూడా పవిత్ర లోకేష్ హీరో తల్లి పాత్రలో నటించారు. అలాగే మళ్లీ మళ్లీ ఇది రాని రోజులో పవిత్ర లోకేష్ పోషించిన పాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో పవిత్ర లోకేష్ ని చాలా ఫేమస్ అయ్యేలా చేసింది.
ఆ తర్వాత ఇంకా ఎన్నో మంచి సినిమాల్లో ఎన్నో మంచి పాత్రల్లో నటించారు. గత కొంత కాలం నుండి పవిత్ర లోకేష్ పై మరో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సీనియర్ నటుడు నరేష్ ని పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారు అని పుకార్లు వచ్చాయి. ఈ విషయంపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు పవిత్ర లోకేష్ తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చాలా అభ్యంతరకరమైన పోస్ట్ లు చేస్తున్నారు అని మైసూరు సైబర్ క్రైమ్ సెల్ కి కంప్లైంట్ ఇచ్చారు. అలాగే తనపై ఏవేవో వార్తలు ప్రచారం చేస్తున్నారు అంటూ పవిత్ర లోకేష్ ఫిర్యాదులో తెలిపారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదును తీసుకుంది. వారి బృందం ఈ విషయంపై దర్యాప్తు చేస్తారు.