ప్రస్తుత కాలం లో సమాజం లో నేరాల సంఖ్యా విపరీతం గా పెరిగి పోయింది. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తియ్యడం లేదా ప్రాణాలు తీసుకోవడం చేస్తున్నారు జనాలు. ఈ పరిణామం దెబ్బ తిన్న మానవ సంబంధాలను తెలుపుతోంది. తాజాగా ఓ సీరియల్ నటి తన భర్తనే చంపేందుకు ప్లాన్ చేశారు. కానీ భర్త అదృష్టం బాగుండడంతో.. ఆయన బతికి పోయారు. దీంతో ఈ ఘటన బయటికి వచ్చింది.
Video Advertisement
తమిళనాడులోని నల్లగౌండన్కు చెందిన నటి రమ్య దంపతులిద్దరు కలిసి బండిపై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి .. వీరిని తన బైక్ తో ఢీ కొట్టాడు. వీరు కిందపడిన వెంటనే.. ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న బ్లేడ్ తో రమేష్ గోందు కోసి పరారాయ్యాడు. తీవ్ర గాయంతో రక్త స్రావం అవుతున్న రమేష్ ను హాస్పిటల్ కు తీసుకువెల్లగా..అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
ఈ ఘటనపై రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తనతో పాటుతన భార్య రమ్యను కూడా విచారించారు పోలీసులు. అయితే ఈ విచారణలో రమ్య పొంతన లేని సమాధానాలు చెప్పండంతో అనుమానం పెరిగి రమ్యను గట్టిగా నలిదీయడంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. తనే భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్లు ఆమె ఒప్పుకుంది.
పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన రమ్య.. మంచి పాపులారిటీ సాధించింది. అయితే నటి రమ్య ఆమె భర్త రమేష్ ల మధ్య కొంతకాలంగా సఖ్యత లేదు. చిన్నచిన్న విషయాలకు వారిమధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అయితే రమ్య సీరియల్స్ లో నటిస్తూ.. బిజీగా ఉండటం.. ఆమె అలా నటించడం తనకు ఇష్టం లేదని రమేష్ తరచు గొడవలు పడేవాడని విచారణలో తేలింది. అదే సమయంలో రమ్య తన సహనటుడు డేనియల్ అలియాస్ చంద్రశేఖర్ తో సన్నిహితంగా మెలగసాగింది. అతడితో కలిసి తన భర్తను చంపాలని ప్లాన్ చేసింది. చివరకు ఇద్దరు దొరికిపోయారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరినీ జైలుకు తరలించారు.