ధోనీ బయోపిక్ “యం.ఎస్. ధోనీ.. అన్ టోల్డ్ స్టోరీ” చిత్రం ద్వారా యావత్ భారత ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్..బలవన్మరణాకి పాల్పడ్డాదు. ముంబైలోని తన ప్లాట్లో ఉరి వేసుకుని మరణించాడు.. సుషాంత్ మరణంతో బాలివుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది..సుశాంత్ఇప్పటివరకు చేసినవి మంచి సినిమాలే..ఇకపై చేయడానికి చేతిలో సినిమాలున్నాయి..మరి సుశాంత్ ఎందుకు ఆత్మహత్యకి పాల్పడ్డాడు..ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి.మరెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి..

ఇది ఇలా ఉండగా.సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతన్ని హత్య చేసారని అతని కుటుంబం సోమవారం ఆరోపించింది. అతని మరణం వెనుక కుట్ర ఉందని, ఈ విషయంలో పోలీసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసారు కుటుంబ సభ్యులు.

మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, సుశాంత్ మామగారు, “అతను ఆత్మహత్య చేసుకున్నాడని మేము అనుకోము, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేయాలి. అతని మరణం వెనుక కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని హత్య చేశారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకునే వ్య‌క్తి కాదు. సుశాంత్ మ‌ర‌ణం కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇటీవలే సుశాంత్​ మేనేజర్​ దిశా శాలిన్​ సూసైడ్ చేసుకున్న కేసులో పోలీసులు సుశాంత్​పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు” అని ఆయన తెలిపారు.

నిన్న, రాజ్‌పుత్ సోదరి మరియు అతని మేనేజర్ ముంబై పోలీసులతో మాట్లాడుతూ, అతను నిరాశతో పోరాడుతున్నాడని మరియు కొంతకాలం క్రితం తన మందులు తీసుకోవడం మానేశాడు అని అన్నారు.