సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీస్తున్నాయి.

times of india whatsapp chat with samantha about divorce

ఇదిలా ఉండగా, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్లు ఇదే ప్రశ్నపై సమంత ని సంప్రదించినప్పుడు జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ టైమ్స్ కథనం ప్రకారం, వాళ్లు ఆగస్టు 26 వ తేదీన సమంత కి కాల్ చేశారు. అప్పుడు సమంత షూటింగ్ లో ఉన్నాను అని చెప్పారు. అప్పుడు టైమ్స్ బృందం మళ్లీ తర్వాత కాల్ చేయొచ్చా అని అడిగారు. అందుకు సమంత సరే అన్నారట. తర్వాత ఫోన్ రీచ్ అవ్వలేదట.

మరుసటి రోజు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. దాంతో సమంత వేరే నంబర్ కి కాల్ చేశారట. ముందు రోజు ఎవరైతే మాట్లాడారో, వాళ్లే అప్పుడు కూడా మాట్లాడారు. కానీ తను సమంతని కాదు అని చెప్పారట. అలాగే వారు సమంతకి మెసేజ్ చేసిన విధానం సరైనది కాదు అని సీరియస్ గా అన్నారట. ఆగస్టు 26వ తేదీ రోజే సమంతకి టైమ్స్ వారు మెసేజ్ చేశారు.

అందులో ఈ విధంగా ఉంది. “హాయ్ సమంతా. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నుండి విక్కీ మాట్లాడుతున్నాను. నేను దేనికోసం అయితే కాల్ చేశానో, అదే విషయంపై మెసేజ్ చేస్తున్నాను. సమంత, మీకు మీ భర్త నాగ చైతన్యకి ఏవో మనస్పర్థలు వచ్చాయి అని మేము విన్నాము. వీటిపై వివరణ ఇస్తారా?” అని ఉంది. ఈ మెసేజెస్ వరకు డెలివరీ అయిన సింబల్ కూడా మనం చాట్ లో చూడొచ్చు. కానీ తర్వాత మెసేజెస్ డెలివర్ అవలేదు. అలాగే ఆగస్టు 27వ తేదీ రోజు కూడా “మేడం. మేము మీకు మళ్ళీ కాల్ చేసాము. పైన అడిగిన మెసేజ్ కి వివరణ ఇస్తారా?” అని మెసేజ్ చేశారు టైమ్స్ బృందం.times of india whatsapp chat with samantha about divorce

కానీ ఆ మెసేజ్ కూడా డెలివర్ అవ్వలేదు. అంటే ఆ నంబర్ నుండి టైమ్స్ వాళ్లు బ్లాక్ చేయబడ్డారు అని అర్థం. ఇదే విషయంపై నాగ చైతన్య టీంని సంప్రదించినా కూడా, వాళ్లు కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. నాగ చైతన్య టీంకి చెందిన సురేష్ అనే వ్యక్తిని టైమ్స్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. సురేష్ తనకు తెలియదు అని చెప్పారట.times of india whatsapp chat with samantha about divorce

తర్వాత నాగ చైతన్య టీంకి చెందిన రాజు అనే వ్యక్తి ని సంప్రదించారు. నాగ చైతన్య తో ఇలాంటివన్నీ మాట్లాడటం సరైనది కాదు. ఇది చర్చించాల్సిన విషయం కాదు అని అన్నారట. అయితే వీరిద్దరిపై మాత్రం ప్రస్తుతం చాలా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన వీరు అధికారిక ప్రకటన ఇస్తారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజమో, ఎంతవరకు పుకారు అనేది మాత్రం తెలియదు.