Advertisement

“ప్రీతి పాప హ్యాపీ” అంటూ…RCB పై పంజాబ్ మ్యాచ్ గెలవడంతో ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్.!

Advertisement

అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, పంజాబ్ కింగ్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 34 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. అంతకముందు టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో కేఎల్ రాహుల్‌(91: 57 బంతుల్లో 7×4, 5×6) తో కలిసి మొదటిసారి పంజాబ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్ ప్రభసిమ్రాన్ (7: 7 బంతుల్లో 1×4) ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నారు.

తర్వాత వచ్చిన క్రిస్‌గేల్ (46: 24 బంతుల్లో 6×4, 2×6) చేయగా, నికోలస్ పూరన్ (0), షారూక్ ఖాన్ (0), దీపక్ హుడా (5: 9 బంతుల్లో) చేశారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ నుంచి హర్షల్ పటేల్ బౌలింగ్‌ లో కేల్ రాహుల్‌ తో పాటు హర్‌ ప్రీత్ (25 నాటౌట్: 17 బంతుల్లో 1×4, 2×6) భారీ షాట్లు ఆడారు. పంజాబ్ కింగ్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 179 పరుగుల స్కోర్ చేసింది.

180 పరుగుల లక్ష్యఛేదనలో బరి లోకి అడుగు పెట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (7: 6 బంతుల్లో 1×6) మూడో ఓవర్‌ లోనే క్లీన్ బౌల్డ్ అయ్యారు. తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ (31: 30 బంతుల్లో 2×4, 1×6) మెల్లగా పరుగులు రాబట్టారు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన హర్‌ ప్రీత్ బౌలింగ్‌ లో క్రీజ్ వెలుపలికి వెళ్లి షాట్ ఆడబోయిన విరాట్ కోహ్లీ (35: 34 బంతుల్లో 3×4, 1×6) బంతిని కనెక్ట్ చేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యారు.

అదే ఓవర్‌ లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికి గ్లెన్ మాక్స్‌వెల్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యారు.ఏబీ డివిలియర్స్ (3:9 బంతుల్లో) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన షబాజ్ అహ్మద్ (8), డేనియల్ శామ్స్ (3) చేయగా చివరిలో హర్షల్ పటేల్ (31: 13 బంతుల్లో 3×4, 2×6), జెమీషన్ (16 నాటౌట్: 11 బంతుల్లో 1×4, 1×6) చేసి గెలుపు అంతరాన్ని తగ్గించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 145/8 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20


Advertisement
Advertisement