గత కొన్నాళ్లుగా సీనియర్ నటుడు నరేష్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. పవిత్ర లోకేష్, నరేష్ రిలేషన్షిప్ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. వీరిద్దరూ గురించి వచ్చే ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. వి.కె నరేష్ తన కెరియర్ లో ఎన్నో చిత్రాలకు హీరోగా చేసి మెప్పించారు. ప్రస్తుత కాలంలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు నరేష్. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు.
అంతేకాకుండా వి.కె. నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కూడా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు . మరో వైపు నటి పవిత్ర కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రచ్చ కారణంగా వీరిద్దరి గురించే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది.
ప్రస్తుతం పవిత్రతో ఆయన రిలేషన్ విషయమై వివాదంలో నిలవడంతో ఆయన పరువు పోయినట్లైంది. మూడవ భార్య రమ్య తనకి విడాకులు ఇవ్వకుండానే.. నటి పవిత్రతో ఎఫైర్ పెట్టుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి పవిత్ర మరియు నటుడు నరేష్ ల రిలేషన్ షిప్ ల విషయమై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువ అవుతోంది.
ఇటీవల వీరిద్దరూ ఓ హోటల్ రూమ్ లో ఉండగా నరేష్ మూడవ భార్య రమ్య ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త బాగా వైరల్ అయింది. అయితే.. ఈ రచ్చ తరువాత పవిత్ర, నరేష్ లు వేరు వేరుగా వీడియో రిలీజ్ చేసారు. అయితే ఈ వీడియోలలో ఉన్న కామన్ బ్యాక్ గ్రౌండ్ ని చూసి నెటిజన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేసారు. ఇద్దరు ఒకే రూమ్ లో ఉండి వేరు వేరుగా వీడియోలు రిలీజ్ చేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ కూర్చున్న సోఫా ఒకేలా ఉందని, ఒకే రూమ్ లో ఉండి మాట్లాడారని వారి బ్యాక్ గ్రౌండ్ ని చూస్తేనే తెలిసిపోతుందని నెటిజన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు.