Advertisement

6 మ్యాచుల్లో 4 డకౌట్‌లు…టీం కి అవసరమా.? పంపించేయండి అంటూ ట్రెండ్ అవుతున్న ట్వీట్స్.!

Advertisement

ప్రస్తుతం ఐపీఎల్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 14 వ సీజన్ లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ పేలవం గా ఆడుతున్నారు. పూరన్ ఇప్పటికే ఈ సీజన్ లో మూడు సార్లు డక్ అవుట్ అయ్యారు. ఇంకొక సారి పరుగులు ఏమి చేయకుండా సరాసరి పెవిలియన్ చేరుకున్నాడు.

రీసెంట్ గా, అహ్మదాబాద్ మోడీ స్టేడియం లో ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో పూరన్ మరోసారి డక్ అవుట్ అయ్యారు. పేసర్ కైల్ జేమిసన్‌ బౌలింగ్ చేస్తుండగా.. 12 వ ఓవర్ లో డక్ అవుట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సీజన్ లో ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగు మ్యాచులు డక్ ఔట్ అయినా ఆటగాడి గా నికోలస్‌ పూరన్‌ రికార్డు సృష్టించాడు. మొత్తం నాలుగు సార్లు డక్ అవుట్ అయిన ఆటగాళ్లలో నికోలస్‌ పూరన్‌ ఐదవవాడిగా నిలిచారు.

గతం లో కూడా శిఖర్‌ ధావన్‌ (2020), మనీష్‌ పాండే (2012),మిథున్‌ మన్హాస్‌ (2011),హర్షల్ గిబ్స్‌ (2009) లు నాలుగు సార్లు డక్ అవుట్ అయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో నికోలస్ చేసిన పరుగులు చూస్తే వరుసగా.. 0,0, 9,0,19,0 గా ఉన్నాయి. ఆరు మ్యాచుల్లోనూ నికోలస్ చేసిన స్కోర్ కనీసం 30 కూడా దాటలేదు. దీనితో.. క్రికెట్ అభిమానులు నికోలస్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేసారు.

ఇంత దారుణం గా పెర్ఫార్మ్ చేస్తుంటే.. పంజాబ్ టీం నికోలస్ ను ఎందుకు కంటిన్యూ చేస్తోంది పూరన్ ను తీసేసి.. ఆ ప్లేస్ లో మలాన్‌ను ను జట్టు లోకి తీసుకోవాలని ఐపీఎల్ ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ” నికోలస్ ఇంకా నువ్వు ఆడడం అవసరమా” అంటూ డైరెక్ట్ గానే ప్రశ్నిస్తున్నారు. “ఇంకా ఎందుకు ఆడించడం.. ఇంటికి పంపేయండి” అంటూ మరి కొందరు ట్వీట్ లు చేస్తున్నారు. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ ట్రోల్ల్స్ పై మీరు ఓ లుక్ వేయండి.

#1.

#2.

#3.

#4.


Advertisement
Advertisement