విశాఖపట్నం బీచ్ లో మంగళవారం ఓ వివాహిత ఇసుకలో శవమై కనిపించిన సంఘటన తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. నిర్మాణుష్యంగా ఉన్న బీచ్ లో వివాహిత మృతదేహం ఉన్న తీరు అనేక సందేహాలను రేకిత్తిస్తున్నాయి.

Video Advertisement

మృతదేహన్ని చూసిన మార్నింగ్ వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వివాహితను శ్వేతగా గుర్తించారు. తరువాత శ్వేత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పటల్ కి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే, శ్వేత, మణికంఠలకు గత ఏడాది పెళ్లి జరిగింది. వీరు విశాఖపట్నంలోని గాజువాకలో ఉండేవారు. మణికంఠ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. అతను కొన్ని రోజులు అక్కడే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు. అలా పెళ్లైన 2 నెలల పాటు వీరి జీవితం సంతోషంగా సాగింది. ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.  మణికంఠ భార్యతో ప్రేమగా ఉండకపోవడం, ఆమె కన్నా తన ఫ్యామిలీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండడంతో శ్వేత తట్టుకోలేకపోయింది. ఈ విషయంగా శ్వేత, మణికంఠలు మధ్య తరుచు గొడవ అయ్యేదని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే శ్వేత గర్భవతి అనే విషయం తెలిసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ తొలగించడంతో హైదరాబాద్ వెళ్లాడు. అప్పటి నుండి శ్వేత అత్త మామలతో ఉండేది. తాను ప్రెగ్నెంట్ అయినప్పటికి వదిలి వెళ్లడం, అదికాక ప్రేమగా చూడకపోవడంతో ఆమె మనస్థాపానికి గురైంది. అత్తమామలు కూడా ఆమెను వేధించేవారని, భర్తతో చెప్తే వాళ్ళు చెప్పినట్టు చేయమని చెప్పేవాడని, ఈ క్రమంలోనే మంగళవారం నాడు కూడా శ్వేత, మణికంఠలు ఫోన్ లో గొడవ పడ్డారు. ఆ తరువాత శ్వేత లెటర్ రాసి పెట్టి, ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
ఎంత సేపటికి శ్వేత తిరిగి రాకపోయేసరికి ఆమె అత్తమామలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. మంగళవారం ఇంట్లో నుండి వెళ్ళిన శ్వేత విశాఖ బీచ్ లో శవమై కనిపించింది. అటుగా వెళ్ళిన వాకర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం సగం వరకు ఇసుకలో కూరుకుపోయి ఉండడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. కీలకంగా కానున్న ఫోన్ కాల్ రికార్డ్స్:
గత కొద్ది రోజుల నుంచి శ్వేత, మణికంఠలు తరుచు గొడవపడేవారట. శ్వేత భర్త హైదరాబాద్ వెళ్ళినప్పటి నుండి కూడా  ఫోన్ లో తరుచు గొడవ పడేవారని సమాచారం. పోలీసులు ఘటన పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్వేత, మణికంఠలు ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారు. ఏం జరిగింది అనే  విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. ఈ నేపద్యంలో వీరి కాల్ రికార్డింగ్స్ కేసుకి కీలకం అని పోలీసులు తెలిపారు.

Also Read: బీటెక్ చదివిన కూతుర్ని పాప్‌కార్న్ అమ్ముకునే వాడికి ఇచ్చి చేశాడు..! కారణం తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే..!