కోల్గేట్ పేస్ట్ తెలియనివారెవరైనా ఉంటారా? కోల్గేట్ మొదలయింది 1805 లో. కోల్గేట్ సంస్థ తన మొదటి బ్రాంచ్ ను ప్రారంభించిన దేశం న్యూ యార్క్ సిటీ.

తర్వాత వేరే దేశాల్లో కూడా ఎంతో పాపులర్ అయింది. యుఎస్ మార్కెట్లో లాంచ్ అయిన మొదటి దంత సంరక్షణ సంస్థ కోల్గేట్. అలా దాదాపు 50 సంవత్సరాల వరకు ఏ పోటీ లేకుండా మొదటి స్థానంలో ఉండేది కోల్గేట్.

తర్వాత యూనిలీవర్ ప్రారంభించిన పెప్సోడెంట్ లాంటి కొత్త బ్రాండ్ల కారణంగా కోల్గేట్ కి మెల్ల మెల్లగా మార్కెట్ విలువ తగ్గడం మొదలైంది.

తాము ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నాము. కాబట్టి ఎవరూ తమని ఏమీ చేయలేరు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండేది కోల్గేట్ సంస్థ. కానీ కొద్ది రోజులకే ప్రతి చోటా ఊహించని స్థాయిలో విమర్శలు రావడం మొదలైంది.

అప్పుడు కోల్గేట్ సంస్థ ఏం చేయాలో తెలీక సేల్స్ పెంచడానికి ఉపాయాలని వెతకటం మొదలుపెట్టింది. బోర్డ్ మెంబర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏం చేయాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ఏ ఒక్కరికీ సరైన ఐడియా రావట్లేదు.

ఆ ఉద్యోగి అక్కడి వాళ్ళతో తన దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్పాడు. దానికి వాళ్ళు సరే అని చెప్పమన్నారు. అప్పుడు అతను పేస్ట్ బయటికి వచ్చే హోల్ సైజు కొన్ని మిల్లీమీటర్లు పెంచితే సేల్స్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పాడు.

ఆ ఐడియా విన్న బోర్డు మెంబర్లు అందరూ అతన్ని చూసి నవ్వారు. అంతేకాకుండా అతను చెప్పిన ఆలోచన చాలా తెలివి తక్కువగా ఉంది అని వెటకారం చేశారు.

తర్వాత ఎన్నో ఐడియాలు అమలు చేశారు కానీ ఒక్కటి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో కంపెనీ ఆర్థిక పరిస్థితి ఇంకా కిందకి వెళ్ళిపోయింది.

అతను చెప్పినట్టే పేస్ట్ బయటికి వచ్చే హోల్ ని కొంచెం పెంచారు. దీంతో మెల్లగా మార్కెట్లో కోల్గేట్ అమ్మకాలు మళ్లీ పెరగడం మొదలయ్యాయి. ఆర్థిక పరిస్థితి మెల్లగా కోలుకుంది. దాంతో మళ్ళీ కోల్గేట్ తన మునుపటి స్థానానికి వచ్చేసింది.