సాయి పల్లవి

సాయి పల్లవి తమిళ్ లో జయం రవి, కంగనా రనౌత్ హీరో హీరోయిన్లుగా నటించిన  ధామ్ ధూమ్ అనే సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు. అలాగే కస్తూరిమాన్ అనే సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపిస్తారు.

కాజల్ అగర్వాల్

కాజల్ క్యూ హో గయా నా అనే సినిమాలో ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ గా నటించారు.

సిద్ధార్థ్

బాయ్స్ సినిమాతో హీరోగా తన కెరీర్ మొదలు పెట్టిన సిద్ధార్థ్ అంతకుముందు మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన కన్నతిల్ ముతమిట్టల్ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు

కార్తీ

 కార్తీ నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతాయి. అయితే కార్తీ అంతకుముందు మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు.

అనసూయ

జబర్దస్త్ షో తో పాటు, ఎన్నో సినిమాల్లో కూడా నటిస్తున్న అనసూయ అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమా లో ఒక చిన్న రోల్ లో కనిపిస్తారు.

నవీన్ పోలిశెట్టి

నవీన్ పోలిశెట్టి అంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1-నేనొక్కడినే సినిమాల్లో నటించారు. అలాగే డి ఫర్ దోపిడీ సినిమాలో కూడా నలుగురు హీరోల్లో ఒకరిగా నటించారు.

రవితేజ

. కెరియర్ ప్రారంభంలో రవితేజ సీతారామరాజు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ లో నటించారు.