చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రం లో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది.

ఈయన రచయిత గా, సలహాదారుని గా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి.

చాణక్యుడు చెప్పిన విషయాల ప్రకారం.. మీరు ప్రమాదంలో పడకుండా ఉండాలంటే ఈ ఐదు విషయాలలోను జాగ్రత్త వహించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

# మూర్ఖులతో అనవసరంగా వాదించకూడదట. అలా చేయడం వల్ల లేనిపోని చిక్కుల్లో చిక్కుకుంటారట.

అగ్ని విషయంలో, నీటి విషయంలోనూ, పాము, రాజ కుటుంబ సభ్యుల విషయాల్లో కూడా ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే ఈ ఐదు విషయాల్లో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మన మరణానికి దారితీసేలా చేస్తాయి. అందుకే జాగ్రత్త తప్పనిసరి.