పెళ్లయిన తర్వాత కొత్త జంట హనీమూన్ కి వెళ్తారు. కొత్తగా పెళ్లైన జంటకు వాళ్ళ యొక్క భావాలను పంచుకోవడానికి ఫ్రీగా ఉండడానికి కాస్త సమయం పడుతుంది. పైగా ఒకరితో ఒకరు కలిసి ఏకాంతంగా గడపడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.

అందుకే కొందరు హనీమూన్ అనే పదాన్ని సంప్రదాయంగా తీసుకువచ్చారు. కొన్ని రోజుల పాటు ఏకాంతంగా పెళ్లైన జంట గడపడానికి విహారయాత్రకు పంపిస్తూ ఉంటారు. అప్పట్లో చూసుకున్నట్లయితే హనీమూన్ కి బాగా ధనవంతులు వెళ్లేవారు.

కానీ ఇప్పుడు రాను రాను అందరూ హనీమూన్ ట్రిప్ కి వెళ్తున్నారు. అసలు హనీమూన్ అనే పదం ఎలా వచ్చింది..?, పెళ్లయిన తర్వాత హనీమూన్ కి ఎందుకు వెళ్లాలి అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

1800 చివర్లలో హనీమూన్ సంప్రదాయం అనేది మొదలయ్యింది. అప్పట్లో సంపన్న వర్గాలకు చెందిన వాళ్లు పెళ్లయిన తర్వాత తమకి నచ్చిన చోటికి వెళ్లేవారు. అలా వెళ్లడాన్ని పెళ్లయిన తొలి నెల అని అనేవారు.

పర్యాటక రంగం రానురాను అభివృద్ధి చెందడంతో కొత్తగా పెళ్లయిన వాళ్లు విహారయాత్రలు చేయడం మొదలుపెట్టారు. వాళ్లతో పాటు ఆధునికయుగంలో కుటుంబ సభ్యులు కూడా ట్రిప్ వేసేవారు. ఆ తర్వాత మళ్ళీ కేవలం పెళ్లైన జంట వెళ్లడం మొదలయింది.

పర్యాటక రంగం రానురాను అభివృద్ధి చెందడంతో కొత్తగా పెళ్లయిన వాళ్లు విహారయాత్రలు చేయడం మొదలుపెట్టారు. వాళ్లతో పాటు ఆధునికయుగంలో కుటుంబ సభ్యులు కూడా ట్రిప్ వేసేవారు. ఆ తర్వాత మళ్ళీ కేవలం పెళ్లైన జంట వెళ్లడం మొదలయింది.

1752లో హనీమూన్ అనే పదానికి అర్థం వివరించారు. 18 వ శతాబ్దం మధ్యలో శామ్యూల్ జాన్సన్ రాసిన డిక్షనరీలో వివాహం జరిగిన కొత్తలో సంతోషం, సున్నితత్వం వివరించడం జరిగింది.

పెళ్లి అయిన వెంటనే ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి. కానీ రోజురోజుకీ అవి తగ్గుతాయి. ఇదే మాదిరిగా చంద్రుడు క్షీణించిన తరహాలో కొత్త జంట మధ్య ఉండే ప్రేమ తగ్గుతుందని… అందుకే దీనికి హనీమూన్ అనే పేరు వచ్చింది.

ఇదిలా ఉంటే విక్టోరియన్స్ 30 రోజుల పాటు తేనెతో ఒక మత్తు పదార్థాన్ని తయారు చేసారు. ఇది పెళ్లైన జంట లో ఉండే ఆనందమే ఇక్కడ ఉంటుందని అందుకని హనీమూన్ అని దానికి పేరు పెట్టారు.

అప్పట్లో అయితే నెల రోజుల పాటు హనీమూన్ యాత్రకు వెళ్లే వారు కానీ ఇప్పుడు మూడు నాలుగు రోజులకే పరిమితం అయిపోయింది.