మనకి తెలియకుండా చాలా విషయాలు ఉంటాయి. కొత్త విషయాలని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొత్త విషయాలని మనం తెలుసుకోవడం వలన మన యొక్క జ్ఞానం మరెంత పెరుగుతుంది.

అయితే ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని చూసేద్దాం. అదేం కాదండి పెట్రోల్ రాత్రిపూట కొట్టించుకుంటే ఎక్కువ వస్తుందా…? దీని వెనుక కారణం ఏమిటి అనేది. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ ఆర్టికల్ గురించి ఇప్పుడే చూద్దాం.

సాధారణంగా ఎక్కువ మంది పెట్రోల్ ని లేదా డీజిల్ ని ఉదయం పూట కొట్టించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల తర్వాత పెట్రోల్ లేదా డీజిల్ ని కొట్టించుకోవడం జరుగుతుంది.

అయితే ఉదయం 6 గంటల కంటే ముందు మరియు రాత్రిపూట పెట్రోల్ ని కొట్టించుకోవడం మంచిదట. దీని వెనక చాలా పెద్ద కారణం ఉంది. అదేమిటో ఇప్పుడు మనం చూద్దాం.

పెట్రోల్ సూర్యుడి వేడికి ఎక్స్పాండ్ అవుతుంది. దీనితో పెట్రోల్ యొక్క డెన్సిటీ తగ్గుతుంది. ఒక వేళ ఒక లీటర్ పెట్రోల్ మీరు కొట్టించుకున్నట్లయితే దాని కంటే తక్కువ పెట్రోల్ మాత్రమే మీకు వస్తుంది.

అదే ఒకవేళ మీరు ఉదయం ఆరు కి ముందు లేదా రాత్రిపూట పెట్రోల్ లేదా డీజిల్ ని కొట్టించుకుంటే ఎక్కువ పెట్రోల్ లేదా డీజిల్ వస్తుంది.

కానీ సహజంగా చాలా పెట్రోల్ బంకులలో పెట్రోల్ లేదా డీజిల్ ని అండర్ గ్రౌండ్ లోని స్టోర్ చేయడం జరుగుతుంది. పైగా వాటి మీద పెద్ద పెద్ద కాంక్రీట్ లేయర్లు ఉంటాయి. ఇది నిజంగా మంచి ఇన్సులేటర్ లాగ పని చేస్తుంది.

దీనితో సూర్యుడి వేడి దానికి తగలదు. అలానే డెన్సిటీ తగ్గదు. పెట్రోల్ లో మార్పు కూడా రాదు. కాబట్టి ఉదయం ఆరు గంటలు ముందు పెట్రోల్ ని కొట్టించుకోవాలి అని కానీ, రాత్రిపూటే పెట్రోల్ ని కొట్టించుకోవాలి అనే రూల్ ఏమి లేదు. ఎప్పుడైనా కొట్టించుకోచ్చు.