ప్రేమ అన్న తర్వాత ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చాలా మంది ఈ ప్రేమ విషయంలో చేసే పొరపాటు ఏంటంటే, అవతలి వారు తమని నిజంగానే ప్రేమిస్తున్నారా? లేదా వారి ప్రేమ అబద్దమా? అని తెలుసుకోలేకపోతారు.

మీ పార్ట్నర్ ప్రేమ నిజమా? కాదా? తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు కింద చెప్పబోయేవి చదవండి. దాన్నిబట్టి మీకే అర్థం అయిపోతుంది.

మీ పార్ట్నర్ అందరి ముందు మీరంటే చాలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట వాళ్ళ అందరి ముందు మీతో చాలా క్లోజ్ గా ఉంటారు. కానీ ఇంట్లో మాత్రం ఏదో అంటీ ముట్టనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు.

అవసరమైతే తప్ప మీతో ఎక్కువగా మాట్లాడరు. ఇలా ఉంటే వారి ప్రేమ నిజం కాదు అని అర్థం.

మీ మధ్య ఓపెన్ టాక్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడితే తప్ప అవతలి వారు మాట్లాడరు. మీరు ఏదైనా చెప్తున్నా కూడా ఏదో ఆసక్తి లేకుండా వింటూ ఉంటారు.

ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడడమే తప్ప అవతలి వారి నుండి ఎటువంటి స్పందన ఉండదు. అలాంటప్పుడు వారికి మీపై కానీ, మీరు చెప్పే మాటలపై కానీ ఆసక్తి లేదు అనే విషయాన్ని గమనించాలి.

మీ అలవాట్లను మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ రాకముందు మీకు కొన్ని అలవాట్లు ఉంటాయి. అందులో చెడు అలవాట్లు ఏమైనా ఉంటే, వాటిని మార్చడానికి ప్రయత్నిస్తే పర్వాలేదు.

కానీ మీపై అధికారం ఎక్కువగా తీసుకుని, మీ సాధారణ అలవాట్లు కూడా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.