ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.

అంటూ…”పుష్ప” సాంగ్ పై నెటిజన్స్ కౌంటర్..! “డాన్స్ స్టెప్ కూడా కాపీ యేనా..?”

LEARN MORE

Arrow

ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.

LEARN MORE

Arrow

దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మొదటి పాట దాక్కో దాక్కో మేక కూడా ఇవాళ విడుదల అయ్యింది.

LEARN MORE

Arrow

ఈ పాటని తెలుగులో శివం పాడగా చంద్ర బోస్ గారు రాశారు. ఈ పాటని హిందీలో విశాల్ దద్లానీ, తమిళ్ లో బెన్నీ దయాల్, మలయాళంలో రాహుల్ నంబియార్, కన్నడలో విజయ్ ప్రకాష్ పాడారు.

LEARN MORE

Arrow

ఈ పాటకి ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. అయితే, ఇందులో హుక్ స్టెప్ గమనిస్తే మాస్టర్ సినిమాలోని వాతి కమింగ్ స్టెప్ లాగా ఉంది.

LEARN MORE

Arrow

ఇది మాత్రమే కాకుండా ఇటీవల ధనుష్ హీరోగా విడుదలైన జగమే తందిరం సినిమాలోని రకిట రకిట పాటలో కూడా ఇలానే ఉంటుంది.

LEARN MORE

Arrow

దాంతో నెటిజెన్స్ అందరూ అదేంటి స్టెప్ సేమ్ మాస్టర్ సినిమాలోని పాటలో లానే ఉంది కదా అని అంటున్నారు. కానీ అల్లు అర్జున్ మేకోవర్ కి మంచి మార్కులే పడ్డాయి.

LEARN MORE

Arrow

ఈ సినిమాకోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డారో ఈ పాటలో తెలిసిపోతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. విలన్ గా మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.

LEARN MORE

Arrow