పోలీసులకి మరియు ట్రాఫిక్ పోలీసులకి ఎడమ వైపు భుజానికి తాడు లాంటిది ఉంటుంది. ఎందుకు అసలు ఈ తాడు అనేది పెడతారు అంటే

ఈ తాడు కి ఒక విజిల్ లాంటిది చివర ఉంటుంది. ఈ విజిల్ ని అత్యవసర పరిస్థితుల్లో అది ఇండికేషన్ గా పని చేస్తుంది.

అదే ఒకవేళ ట్రాఫిక్ పోలీసులకు అయితే ఇది మరింత బాగా ఉపయోగ పడుతుంది.

ట్రాఫిక్ పోలీసులకి కచ్చితంగా విజిల్ చాలా అవసరం. ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి విజిల్ ఉపయోగ పడుతుంది.

అది పడిపోకుండా సపోర్ట్ గా ఆ తాడు ఉంటుంది. ఆ తాడు ఉండడం వలన విజిల్ మిస్ అవకుండా ఉంటుంది.

ఎక్కువగా మనకి నల్లటి, ఎర్రటి మరియు ఖాకీ రంగు తాడులు కనపడతాయి.

ఈ విజిల్ ని తాడుకు అమర్చి.. దానిని జేబులో పెట్టడం జరుగుతుంది. ఇంగ్లీషులో దీనినే లాన్ యార్డ్ అంటారు.

ఇది ఆ తాడు ఉండడానికి అసలు కారణం. నల్ల రంగు తాడు కానిస్టేబుల్ కి, ఎరుపు రంగు ఎసై, సీఐలకి, నీలం రంగు డీఎస్పీ నుండి పైస్థాయి వారికి ఉంటుంది.