శరీరమంతా బూడిదతో చూడడానికి చాలా వింతగా ఉంటారు అఘోరాలు. ఆడవాళ్ళల్లా జుట్టుని పెంచుకునే.. పుర్రెలని పట్టుకుని ఎంతో భయంకరంగా ఉంటారు.

అయితే అఘోరాల జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి జీవన విధానాన్ని అనుసరిస్తారు, అసలు ఎక్కడ ఉంటారు ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎక్కువగా మనకి అఘోరాలు కనపడవు. కుంభమేళాలు, పుష్కరాలు వంటివి జరిగినప్పుడు అఘోరాలని మనం చూడొచ్చు.

మిగిలిన సమయాల్లో వాళ్లు ఎక్కడ ఉంటారు అనేది చూస్తే… మానవుల సంచారం లేని నిశబ్దకరమైన ప్రాంతాలలో వాళ్ళు ఉంటారు. ఎక్కువ ధ్యానం చేసుకుంటూ ఉంటారు.

రాత్రివేళల్లో స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. వీళ్లు నరమాంసాన్ని ఇష్టపడతారు. శవాలని ప్రేమిస్తారు. అఘోరాల చేతులలో పుర్రె ఉంటుంది.

అయితే ఇది మగవారి పుర్రె. ఎందుకంటే వీళ్ళు అస్సలు ఆడవాళ్ళ పుర్రెని ముట్టుకోరు.

స్మశానంలో వీళ్ళు ఒక మగవారి పుర్రెని తీసుకుని పుర్రెను పైభాగం నుంచి కోసేసి దానిని ఒక చిన్న పాత్ర మాదిరి తయారు చేస్తారు.

స్మశానంలో వీళ్ళు ఒక మగవారి పుర్రెని తీసుకుని పుర్రెను పైభాగం నుంచి కోసేసి దానిని ఒక చిన్న పాత్ర మాదిరి తయారు చేస్తారు.