ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన ఇ-రూపీ యాప్ అంటే ఏంటి..?
డిజిటల్ కరెన్సీ ని పెంపొందించుకునే విధం గా భారత్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. పాత నోట్లు రద్దు అయ్యిన తరువాత నుంచి డిజిటల్ కరెన్సీ ఎక్కువ గా వాడకం లోకి వచ్చింది.
గూగుల్ పే, ఫోన్ పే వంటి ఆప్ లు వచ్చాక ఈ వాడకం మరింత పెరిగింది. చిన్న చిన్న కిరానా కోట్లలో సైతం ఆన్ లైన్ పేమెంట్స్ చేసేస్తున్నాం.
తాజాగా.. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇ-రూపీ ఆప్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి పూర్తి గా తెలుసుకుందాం.
ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ హెల్త్ అథారిటీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ల ద్వారా ఈ e-RUPI అనే అప్ ను అభివృద్ధి చేసారు.
కాష్ తో పని లేకుండా.. డిజిటల్ చెల్లింపుల కోసం ఈ ఆప్ ను రూపొందించారు. నగదుని SMS లేదా QR కోడ్ రూపం లో సంబంధిత వ్యక్తి కి బట్వాడా చేయాల్సి ఉంటుంది.
ఈ యాప్ ఒక ప్రీపెయిడ్ గిఫ్ట్ వోచర్ లాగ పని చేస్తుంది. ఈ ఆప్ కు ఎలాంటి డెబిట్, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ ఆప్ అవసరం లేదు. నిర్దిష్ట కేంద్రాలలో దీనిని రీడీమ్ చేసుకోవాలి.
అలాగే.. దీనిని మనం డిజిటల్ గానే చేసుకోవచ్చు. అంటే.. మీరు ఏదైనా ఒక వస్తువుని కొనుక్కున్నప్పుడు..మీకు ఆ కొనుగోలు పై వోచర్ లభించింది అనుకోండి.
దానిని రీడీమ్ చేసుకోవాలంటే వోచర్ ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సింపుల్ గా QR కోడ్ లేదా SMS ద్వారా పంపించేయవచ్చు.