కోహ్లీకి ఉన్నట్టు ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు లేదు? కారణం తెలుస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!
LEARN MORE
ధోని హెల్మెట్ మీద భారతదేశం జాతీయ జెండా సింబల్ ఉండదు. కానీ మిగిలిన భారతదేశం జట్టు క్రికెటర్స్ హెల్మెట్ మీద మాత్రం జాతీయ జెండా సింబల్ ఉంటుంది.
మీలో కొంతమందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు కొంతమందికి ఈ విషయం తెలియక పోవచ్చు. ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా సింబల్ ఉండకపోవడానికి గల కారణం ఏంటి అంటే.
సాధారణంగా వికెట్ కీపర్ హెల్మెట్ ధరించనప్పుడు కొంచెం దూరం లో పెట్టాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం మన జాతీయ జెండా గౌరవానికి చిహ్నం. అందుకే జెండా అలా నేలమీద ఉండకూడదు.
కాబట్టి ఒకవేళ హెల్మెట్ మీద జాతీయ జెండా సింబల్ ఉంటే హెల్మెట్ పక్కన పెట్టకూడదు. ఒకవేళ హెల్మెట్ పక్కన పెట్టాలి అంటే హెల్మెట్ మీద జాతీయ జెండా సింబల్ ఉండకూడదు.
అంతేకాకుండా వికెట్ కీపింగ్ చేసేటప్పుడు బాల్ హెల్మెట్ కి తగిలే అవకాశాలు ఉంటాయి. అలా బాల్ జాతీయ జెండా కి తగలకూడదు.
మహేంద్ర సింగ్ ధోనీకి దేశం పై ఎంతో గౌరవం ఉంది అనే విషయం అందరికీ తెలుసు. దేశం పై ఉన్న ప్రేమ తో మహేంద్రసింగ్ ధోని ఇండియన్ ఆర్మీ లో లెఫ్టినెంట్ కల్నల్ పొజిషన్ స్వీకరించారు
ఒకవేళ తాను క్రికెటర్ కాకపోయి ఉంటే ఆర్మీలో జాయిన్ అయ్యేవాడిని అని ధోని ఎన్నోసార్లు చెప్పారు.