ఇటీవలి కాలం లో విడాకులు ఎక్కువ అవుతున్నాయి. ఆర్ధిక స్వేచ్ఛ, మితిమీరిన టెక్నాలజీ వాడకం, చిన్న గొడవలకు విడిపోవాలన్న ఆలోచనలు వస్తుండడం, ఇలా కారణం ఏదైతేనేమి.. విడాకుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంటోంది.
అయితే.. విడాకులు తీసుకున్నాక భర్త.. ఎంతో కొంత మొత్తాన్ని భార్యకు భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటివరకు బాగోగులు చూసుకున్న భర్త లేకపోతే.. ఆ మహిళ రోజులు గడవడానికి ఇబ్బందిపడాలి కాబట్టి భరణం అన్న దానిని తీసుకొచ్చారు.
కానీ, ఈరోజుల్లో మాత్రం మహిళలు భరణాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇటీవల సమంత, నాగ చైతన్యలు కూడా విడాకులు తీసుకున్నారు. భరణంగా నాగచైతన్య ఇవ్వాల్సిన 200 ల కోట్ల రూపాయలను సమంత తిరస్కరించింది అన్న వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే, ఇది అధికారికం కాదు. గతంలోకి చూసుకున్నా, మెకంజీ కూడా భరణం కింద వచ్చే రెండున్నర లక్షల కోట్ల రూపాయలను తిరస్కరించింది.
కేవలం సెలెబ్రిటీలే కాదు, సాధారణ మహిళల్లో కూడా భరణాన్ని తిరస్కరించే మహిళలు ఎక్కువ అవుతున్నారు అని నిపుణులు చెబుతున్నారు. దీనికి ఐదు కారణాలున్నాయి. అవేంటో చూద్దాం.
#1. ఈకాలం లో అమ్మాయిలు స్వతంత్రంగా బతుకుతున్నారు. విద్యారంగం లో రాణించి, తమ చదువుకు తగ్గ కొలువును ఎంచుకుని ఆర్ధిక స్వేచ్ఛ తో జీవిస్తున్నారు. వీరు భర్త నుంచి భరణం పై ఆధారపడడానికి ఇష్టంలేక తిరస్కరిస్తున్నారు
#2. విడిపోయేదాకా వచ్చారంటే.. భార్యాభర్తల మధ్య గొడవలు ఓ రేంజ్ లో జరిగివుంటాయి. భర్త లక్షణాలపైన ఇష్టం లేకపోవడం, భర్త ప్రవర్తనపైనా విసుగు చెంది ఉంటారు. తిరిగి అలాంటి భర్త దగ్గర డబ్బును తీసుకోవడానికి చాలామంది ఇష్టపడడంలేదు. భర్త సంపాదించే అక్రమ సంపాదనలు నచ్చనివారు కూడా తిరస్కరిస్తూ ఉండి ఉండవచ్చు.