ఐపీఎల్ హడావిడి ముగిసింది అనుకునేలోపు వరల్డ్ కప్ సందడి మొదలైంది. నిన్న బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ల మధ్య తొలి టి20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. కొన్ని రోజుల క్రితం ఐసీసీ క్రీడోత్సవం సందర్భంగా బీసీసీఐ టీమ్ ఇండియా ఆటగాళ్లు వరల్డ్ కప్ మ్యాచ్ కి ధరించే కొత్త జెర్సీలను విడుదల చేసింది.

విడుదల అయిన కొద్దీ సేపటికే ఈ ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. బుమ్రా, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ లు ఈ ఫోటోలలో కొత్త జెర్సీలు ధరించి కనిపించారు.

భారత జట్టు ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలు ధరించి ఉన్న ఫోటోలు విడుదల అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గతం లో ఉండే జెర్సీ లు బాగా డార్క్ బ్లూ కలర్ లో ఉండేవి. కొత్తగా డిజైన్ చేసిన ఈ జెర్సీలు థిక్ బ్లూ కలర్ లో ఉన్నాయి.

జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్ లలో టీమ్ ఇండియా ఈ కొత్త జెర్సీలనే ధరించనుంది. ఈ జెర్సీల గురించి గతంలో కూడా చాలానే వార్తలు వచ్చాయి. అభిమానుల బిలియన్ చీర్స్ ప్రేరణతో.. అందుకు అనుగుణంగా ఈ జెర్సీ ని డిజైన్ చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.

ఈ జెర్సీలపై ఉన్న సౌండ్ వేవ్ డిజైన్ గమనించారా? నిజానికి అది డిజైన్ మాత్రమే కాదట. ఆ సౌండ్ వేవ్ అనేది చీర్స్ ప్యాట్రన్. అభిమానులు మ్యాచ్ జరుగుతున్న సమయం లో “ఇండియా… ఇండియా…” అంటూ ఉత్సాహంతో అరుస్తూ ఉంటారు.

సౌండ్ వేవ్ ను రికార్డు చేస్తే వచ్చిన ప్యాట్రన్ ను జెర్సీ పై ముద్రించారు. ఈ విషయం బయటకు వెల్లడయ్యాక క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇది ఓ వినూత్నమైన ఆలోచన అంటూ క్రికెట్ అభిమానులు బీసీసీఐకి కితాబిస్తున్నారు.