ప్రస్తుతం ప్రపంచం అంత కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ప్రకటించారు మోడీ. చాలామంది ఇళ్లకే పరిమితం అయినప్పటికీ కొంతమంది మాత్రం ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఎమర్జెన్సీ లేకుంటే తిరగద్దు అని చెప్పిన పట్టించుకోవట్లేదు. వాహనాలు సీజ్ చేసినప్పటికీ ఆగట్లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఓ బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కొట్టేసరికి ఓ 32 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.

Also check: హైదరాబాద్ ఐసోలేషన్ వార్డ్ లో బాధితురాలి పరిస్థి ఇది…వైరల్ వీడియో..!

ఇండియా టుడే కథనం ప్రకారం…బుధవారం రోజున హౌరా కు చెందిన ఆ వ్యక్తి పాలు కొనడానికి బయటకి వెళ్ళాడు అంట. లాల్ స్వామి భార్య చెప్పిన దాని ప్రకారం….రోడ్డు మొత్తం రద్దీగా ఉండటంతో పోలీసులు లాటి ఛార్జ్ చేసారు అంట. ఆ సమయంలో ఆ వ్యక్తి కూడా అక్కడే ఉండటంతో అతనిపై కూడా లాటి ఛార్జ్ చేసారంట. లాటి ఛార్జ్ తర్వాత వెంటనే హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్ లు అతను అప్పటికే మరణించారని చెప్పారు. ఆ వ్యక్తి కుటుంబసభ్యులు మాత్రం పోలీసుల లాటి ఛార్జ్ వల్లే అతను మరణించారని చెబుతున్నారు. పోలీసులు మాత్రం అతను కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారని అంటున్నారు.

Also read: కూతురికి కరోనా సోకకూడదని అని ఆ డాక్టర్ ఏం చేసారో తెలుసా?

ఇది ఇలా ఉంటే…దేశంలో కరోనా భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. మంగళవారం వరకు తెలంగాణలో 39 కరోనా కేసులు నమోదు కాగా…బుధవారం రెండు, గురువారం మూడు కలుపుకొని ప్రస్తుతం తెలంగాణాలో కోవిడ్ కేసుల సంఖ్య 44కు చేరింది. ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా ఇప్పటి వరకు తెలంగాణ లో 9 మందికి కరోనా సోకింది. కాబట్టే అందరు ఇళ్లకే పరిమితం అవ్వడం మంచిది. ప్రభుత్వం కి మనం కూడా సహకరిస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలము. లేకుంటే ఇటలీ అమెరికా లాంటి పరిస్థితులే చూడాల్సి వస్తుంది మనం కూడా.భయపడకండి…జాగ్రత్తగా ఉండండి.

source: indiatoday

Note: image used is just for reference but not the actual characters

If you want to contribute content on our website, click here

Cryptoknowmics Sharing is Caring:
No more articles