వినాయక నిమజ్జనం ఏ సమయం లో చేయాలి..?

వినాయక నిమజ్జనం ఏ సమయం లో చేయాలి..?

by Anudeep

వినాయక ఉత్సవాలు దేశమంతటా ఘనం గా జరుగుతాయి. నవరాత్రులు ఆ విఘ్నేశ్వరుడిని కీర్తించి.. ఆ తరువాత తొమ్మిదో రోజు రాత్రికి నిమజ్జనం చేస్తారు. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో.. సందుకో పందిరి వెలుస్తోంది. అందరు భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎంత పెద్ద విగ్రహం పెడితే.. అంత గొప్ప అన్నట్లు చాలా మంది భావిస్తున్నారు. ఐతే.. సామాజిక బంధాలు బలపడే విధం గా ఇలాంటి వేడుకలను జరుపుకోవడం లో ఆక్షేపణ ఏమి లేదు. అయితే.. ఈ వేడుక తరువాత నిమజ్జనం జరిగే సమయం లోనే చిక్కు వస్తుంది.

Video Advertisement

nimajjanam

కొంతమంది మూడు రోజులకే నిమజ్జనం చేసేస్తారు. కొందరు ఆరు, తొమ్మిది, పదకొండు రోజులలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే.. హిందూ శాస్త్రం ప్రకారం నిమజ్జనం చతుర్దశి తిధి రోజున చెయ్యాలని పండితులు చెబుతున్నారు. అనగా.. ఈ నెల పందొమ్మితవ తేదీ మధ్యాహ్నం 12:14 నిమిషాల సమయం నుంచి సాయంత్రం 7:39 నిమిషాల లోపు చేసుకోవాలని .. ఈ సమయం లో ముహూర్తం బాగుందని పండితులు చెబుతున్నారు.


You may also like