RRR కి “బెస్ట్ యాక్టర్” ఆస్కార్ వస్తే… ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేలాగా ఉందిగా..?

RRR కి “బెస్ట్ యాక్టర్” ఆస్కార్ వస్తే… ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేలాగా ఉందిగా..?

by Mohana Priya

Ads

గత కొంత కాలం నుండి తెలుగు ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉన్న స్నేహం ఇంకా ఎక్కువగా బయటికి వస్తోంది. సాధారణంగా మల్టీస్టారర్ సినిమాలు చేయడం అనేది సహజమే. కానీ గత కొంత కాలం నుండి కాంపిటీషన్ లో ఉన్న స్టార్ హీరోలు కూడా ఒకరితో ఒకరు కలిసి సినిమాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ఉంటారు.

Video Advertisement

కానీ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గొడవ పడుతూ ఉంటారు. అభిమానులు కూడా కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో హీరోలు కూడా వారు స్నేహితులం అని, వారు వారు బానే ఉంటారు అని చెప్పటానికి కలిసి బయటికి రావడం, ఒకరి సినిమాని ఒకరు సపోర్ట్ చేయడం, కలిసి సినిమాలు చేయడం వంటివి చేస్తున్నారు. దాంతో అభిమానులు అందరూ కూడా కలిసి ఉంటున్నారు. కానీ మళ్లీ సడన్ గా ఏదో ఒక విషయంలో అభిమానుల మధ్య గొడవ అయ్యి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు.

ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. సినిమాకి అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం రాజమౌళితో పాటు ఇలా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం. సినిమా ప్రమోషన్స్ లో కూడా రాజమౌళితో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఆ ఇద్దరు హీరోలు ఎంత స్నేహంగా ఉంటారో ఈ ప్రమోషన్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు చూస్తే అర్థం అయిపోతుంది. అయితే ఇటీవల ఈ సినిమాలో బెస్ట్ యాక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతో పెద్ద అవార్డ్ అయిన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ కి పంపాలి అంటూ ఒక ప్రముఖ మ్యాగజిన్ రాసింది.

దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ, “అదేంటి? రామ్ చరణ్ కూడా అంతే బాగా చేశారు కదా?” అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ పేరు కూడా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండాలి అంటూ ఒక పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు మరో రకంగా గొడవ మొదలైంది. మా హీరోకి ఆస్కార్ రావాలి అంటే మా హీరోకి ఆస్కార్ రావాలి అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఒక రోజు రెండు రోజులు కాదు. కొన్ని రోజుల నుండి ఈ గొడవ కొనసాగుతూనే ఉంది.

highlights in rrr movie

ఆ మ్యాగజిన్ రాసింది కేవలం వారి అభిప్రాయం మాత్రమే. ఆస్కార్ నామినేషన్స్ అనేవి వీళ్లు నిర్ణయించేవి కావు. ఈ విషయాన్ని తెలుసుకొని ఇకనైనా ఫ్యాన్స్ గొడవ ఆపుతారేమో. ఒకవేళ ఇద్దరిలో ఏ హీరోకి ఆస్కార్ వచ్చినా కూడా మళ్లీ గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఏమో. కానీ ఏదేమైనా సరే ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇంక ఈ గొడవలు ఆపితే మంచిదేమో చూడాల్సిందే.


End of Article

You may also like