ఆటో డ్రైవర్లు ఇలా సైడ్ కి ఎందుకు కూర్చుంటారు.? వెనకున్న కారణాలు ఇవే.!

ఆటో డ్రైవర్లు ఇలా సైడ్ కి ఎందుకు కూర్చుంటారు.? వెనకున్న కారణాలు ఇవే.!

by Anudeep

Ads

భారత్ లో ఎవరైనా తేలిగ్గా ప్రయాణం చేయగలిగే సాధనం ఏదైనా ఉంది అంటే..అది ఆటో రిక్షా. పబ్లిక్ వాహనాలను ఆశ్రయించే వారిలో ఎక్కువ శాతం మంది ఆటో లపై ఆధారపడతారు. అయితే, మీరు ఆటో ఎక్కేటప్పుడు ఓ విషయాన్నీ ఎప్పుడైనా గమనించారా? ఆటో డ్రైవర్ తమ సీటులో కుడి అంచు వైపుకు కూర్చుని ఉంటారు.. దాదాపు చాలా మంది అంతే. కుడి వైపు అంచుకు కూర్చుని డ్రైవ్ చేస్తూ ఉంటారు. అయితే.. డ్రైవర్లు అలా ఎందుకు కుడి వైపు అంచున కూర్చుని డ్రైవ్ చేస్తారో ఎపుడైనా ఆలోచించారా?

Video Advertisement

ఇదే ఆలోచన శివిన్ సక్సేనా అనే వ్యక్తికి వచ్చింది. అతను దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఆటోలలోనే ప్రయాణం చేసాడు. ఆటో డ్రైవర్లు ఎందుకు కుడి అంచుకు కూర్చుని డ్రైవ్ చేస్తారు అన్న సందేహం అతనికి వచ్చింది. వచ్చిందే తడవు గా, ఓ ఆటో డ్రైవర్ ను ప్రశ్నించాడు. అతను చెప్పిన సమాధానం వైరల్ అయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ ప్రశ్నను అతను చాలా మంది డ్రైవర్లను అడిగాడు. వారిలో చాలా మంది అతన్ని చూసి నవ్వేవారు.  కానీ, కొందరు మాత్రం కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు.

సాధారణం గా డ్రైవర్ లు ఆటో తోలడం నేర్చుకునే టపుడు, వారి పక్కన ఒకరు కూర్చుని నేర్పిస్తారు. అలా, వారికి సైడ్ కు కూర్చుని తోలడమే అలవాటు అవుతుంది. మరొక కారణం ఏంటంటే.. డ్రైవర్ సీటు కింద ఉండే ఇంజిన్ ఎక్కువ వేడి గా ఉంటుంది. ఈ వేడి కారణం గానే వారు తరచుగా తమ పొజిషన్ ను మార్చుకుంటూ ఉంటారు.

మరి కొంతమంది సైడ్ కి కూర్చోవడం ద్వారా, మరో పాసెంజర్ ను ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఎమర్జెన్సీ సమయం లో హార్న్ ను కొట్టడానికి, ఆటో ను బాలన్స్ చేయడానికి కుడివైపు అంచునకు కూర్చోవడం వలన వేగం గా చేయగలుగుతారు. అందుకోసమే, చాలా మంది కుడి వైపు అంచుకు కూర్చుంటారు. దీనిపై మరో ప్రయాణికుడు ముదిత్ కాండ్‌పాల్ కూడా స్పందించారు. ఆయన కూడా పలువురు డ్రైవర్లను అడిగారని, వారు ఫన్నీ గా సమాధానాలు చెప్పారని తెలిపారు..

డ్రైవర్ 1 : తమ్ముడూ.. నేను ఆటో లో సైడ్ కి కూర్చోకపోతే ఇంకో ఎక్స్ట్రా పాసెంజర్ ని ఎక్కడ కుర్చోపెట్టగలుగుతాను?

డ్రైవర్ 2 : సైడ్ కి కూర్చుంటాను కాబట్టే మళ్ళీ, మళ్ళీ ఎక్కే పాసెంజర్ల కోసం ప్లేస్ ఎప్పుడు సిద్ధం గా ఉంటుంది. అందుకే సైడ్ కి కూర్చుంటాం..

డ్రైవర్ 3 : ఇదేమి ప్రశ్న అసలు.. ఇదేమి సరదా కాదు. సైడ్ కి కూర్చోవడం వల్ల ఇంకో పది రూపాయలు సంపాదించుకోగలుగుతాము.

డ్రైవర్ 4 : ఒకే వైపు కూర్చుంటే ఆటో ను బాలన్స్ చేయగలుగుతాము. ఆటో ఇంజిన్ చిన్నదే.. కారు, బైక్ లాగ భారీ వాహనం కాదు కాబట్టి సైడ్ కి ఉండి బాలన్స్ చేస్తుంటాం.

 


End of Article

You may also like