YS Vivekananda Reddy: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ ! ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి బాబాయ్ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే, ప్రభుత్వం ఈ కేసు పైన సిబిఐ విచారణ కూడా వేశారు. గత కొన్ని రోజులుగా విచారిస్తున్న సిబిఐ ఈ కేసులో నిన్న మరో ట్విస్ట్ బయటపడింది.
Video Advertisement

ys-vivekannada-reddy-case-twist
వివేకాందన కేసులో తమను అరెస్ట్ చెయ్యకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హై కోర్టులో పిటిషను దాఖలు చేసారు కడప జిల్లా మోతునూతలపల్లి కి చెందిన వై సునీల్ యాదవ్ మరియు అయన కుటుంబంలోని నాలుగు సభ్యులు. ఒకవేళ ఈ కేసులో సిబిఐ విచారణ అవసరమని భావిస్తే న్యాయవాది సమక్షలోనే జరగాలని కోర్టుకు తెలిపారు.
Also Read: తన కార్ ని తానే తగలపెట్టుకున్న ఓనర్… కారణం తెలిస్తే షాక్ అవుతారు.!
వివేకేనంద రెడ్డి ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఇంటికి భారీ భద్రత
వైఎస్ వివేకా హత్య కేసులో గత రెండురోజులుగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి . వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి వాచ్ మెన్ గా పని చేసిన రంగయ్య సంచలన విషయాలు బయటపెట్టాడు. సిబిఐ విచారణలో రంగయ్య కొన్ని కీలక వ్యక్తుల పేర్లు వెల్లడించాడు. దీనితో తనకు ప్రాణ హాని ఉందని చెప్పడం తో రంగయ్య ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు.