వివేకానంద రెడ్డి హత్య కేసులోదూకుడు పెంచిన సిబిఐ అనుమానితుడు అరెస్ట్ ఎవరంటే ? ఆంధ్ర ప్రదేశ్ సీఎం వై స్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైస్ వివేకా హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. వైస్ వివేకా హత్య కేసులో ముందు నుంచి అనుమానితుడు గా భావిస్తున్న సునీల్ కుమార్ యాదవ్ అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Video Advertisement

ys-vivekannada-reddy-case-twist
ఇవి కూడా చదవండి: CHIRU153: మెగాస్టార్ “లూసిఫర్” రీమేక్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ చెప్పిన తమన్.!
ఇంతకు ముందు సునీల్ కుమార్ యాదవ్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అంతే కాదు సిబిఐ తనను కేసుల పేరుతో వేధిస్తోందని కూడా సుప్రీమ్ కోర్ట్ కి తెలిపాడు. సునీల్ కుమార్ యాదవ్ వైస్ వివేకాకు అత్యంత సన్నిహితనంగా ఉంటారు అని అందరూ చెబుతున్న వాదన.

ys vivekananda reddy
ఈ కేసులో వాచ్ మాన్ రంగన్న కూడా సునీల్ కుమార్ యాదవ్ పేరునే ప్రస్తావించినట్టుగా చెబుతున్నారు. సిబిఐ తనని వేదిస్తుందని సుప్రీమ్ కోర్ట్ కి తెలిపిన అనంతరం సునీల్ కుమార్ యాదవ్ కుటుంబం మొత్తం ఒక్కసారిగా అజ్ఞాతంలో కి వెళ్లారు. కానీ పక్కా సమాచారం తెలుసుకున్న సిబిఐ సునీల్ కుమార్ గోవా లో అదుపులోకి తీసుకున్నారు. గత కొన్నాళ్లుగా కరోనా కారణంగా విచారణ లో బ్రేక్ ఇచ్చిన సిబిఐ తిరిగి ముమ్మరం చేసింది. లోకేష్, గోవర్ధన్, రాజు అనే వ్యక్తులతో పాటు మరో ఇద్దరినీ కూడా విచారణ చేపట్టినట్టు సమాచారం. ప్రస్తుతం సిబిఐ కడప కేంద్ర కారాగారం నుంచి 57 రోజులుగా విచారణ సాగిస్తున్నారు. మరి కొన్ని గంటల్లో అధికారికంగా అరెస్ట్ ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.