మనిషి సాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత ఎత్తు పెరగరు అని అంటారు. అయితే ఈ వయసు తేడా ఆడవాళ్ళలో ఒక లాగా, మగవాళ్ళలో ఒక లాగా ఉంటుంది.
బాస్కెట్ బాల్ కానీ, స్విమ్మింగ్ కానీ అలవాటు ఉన్నట్లయితే వారు ఎత్తుగా ఉంటారు అని అంటారు. ఇవి మాత్రమే కాకుండా టెన్నిస్, బాడ్మింటన్ లాంటి గేమ్స్ ఆడే వాళ్ళు కూడా కొంచెం ఎత్తుగా ఉంటారు అని అంటారు.
దాంతో ఒక వయసు దాటిన తర్వాత ఆ మనిషి ఎత్తు మారదు. ఇది మనకు తెలిసిన విషయం.
కానీ నిజం ఏంటంటే ఒక మనిషి ఎత్తు మారుతుందట. దీనికి వయసుతో సంబంధం లేదు. జమైకా హాస్పిటల్ మెడికల్ సెంటర్ ప్రకారం ఒక మనిషి నిద్ర లేచిన తర్వాత తన సాధారణ ఎత్తు కంటే కొంచెం హైట్ గా ఉంటారట
ఇలా ఎత్తు పెరగడానికి తగ్గడానికి కారణం ఏంటంటే మన వెన్నెముక అలాగే ఇతర శరీర భాగాల మధ్య ఉండే గ్రావిటీ తగ్గడమే.