ఏంటి.? నిద్ర లేచినప్పుడు మన ఎత్తు పెరుగుతుందా.? కారణం ఏంటో తెలుసా..?

ఏంటి.? నిద్ర లేచినప్పుడు మన ఎత్తు పెరుగుతుందా.? కారణం ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

మనిషి సాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత ఎత్తు పెరగరు అని అంటారు. అయితే ఈ వయసు తేడా ఆడవాళ్ళలో ఒక లాగా, మగవాళ్ళలో ఒక లాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి వారు ఆడే ఆటలని బట్టి,  లేదా ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఒక మనిషి ఎత్తు పెరగడం అనేది ఉంటుంది.

Video Advertisement

Reason behind a person becoming taller when they wake up

బాస్కెట్ బాల్ కానీ, స్విమ్మింగ్ కానీ అలవాటు ఉన్నట్లయితే వారు ఎత్తుగా ఉంటారు అని అంటారు. ఇవి మాత్రమే కాకుండా టెన్నిస్, బాడ్మింటన్ లాంటి గేమ్స్ ఆడే వాళ్ళు కూడా కొంచెం ఎత్తుగా ఉంటారు అని అంటారు. దాంతో ఒక వయసు దాటిన తర్వాత ఆ మనిషి ఎత్తు మారదు. ఇది మనకు తెలిసిన విషయం.

Reason behind a person becoming taller when they wake up

కానీ నిజం ఏంటంటే ఒక మనిషి ఎత్తు మారుతుందట. దీనికి వయసుతో సంబంధం లేదు. జమైకా హాస్పిటల్ మెడికల్ సెంటర్ ప్రకారం ఒక మనిషి నిద్ర లేచిన తర్వాత తన సాధారణ ఎత్తు కంటే కొంచెం హైట్ గా ఉంటారట. ఇలా ఎత్తు పెరగడానికి తగ్గడానికి కారణం ఏంటంటే మన వెన్నెముక అలాగే ఇతర శరీర భాగాల మధ్య ఉండే గ్రావిటీ తగ్గడమే.

Reason behind a person becoming taller when they wake up

మనం పడుకున్నప్పుడు మన వెన్నెముక మధ్య ఉన్న కంప్రెషన్ తగ్గి కొంచెం పొడవుగా అవుతుంది. దాంతో మన ఎత్తు పెరుగుతుంది. ఆ పెరిగిన ఎత్తు మన మామూలు ఎత్తు కంటే దాదాపు ఒక అంగుళం ఎక్కువ ఉంటుందట. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా? కానీ ఇది సైంటిఫిక్ పరంగా కూడా నిజం అని రుజువు అయ్యింది. కావాలంటే మీరు కూడా ఈసారి నిద్రలేచిన తర్వాత మీ ఎత్తుని గమనించండి.


End of Article

You may also like