“లేపాక్షి” తో పాటు… భారతదేశంలో ఉన్న 10 “మిస్టరీ ఆలయాలు” ఇవే..!

“లేపాక్షి” తో పాటు… భారతదేశంలో ఉన్న 10 “మిస్టరీ ఆలయాలు” ఇవే..!

by kavitha

Ads

భారత దేశంలో లక్షలలో ఆలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం ప్రత్యేకతను కలిగి ఉంటుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయాలలో కొన్ని మాత్రం ఇప్పటికి మిస్టరీగానే ఉన్నాయి.

Video Advertisement

మిస్టరీతో కూడిన ఆశ్చర్యాన్ని కలిగించే ఈ ఆలయాల పై సైంటిస్ట్ లు ఎన్ని సార్లు పరిశోధనలు చేనప్పటికి అవి జవాబు లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఆ ఆలయాలు ఏమిటో? వాటిలో ఉన్న మిస్టరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..1. లేపాక్షి:

లేపాక్షీ ఆంధ్రప్రదేశ్ లో వుంది. ఇక్కడ వున్న ఆలయ స్థంభాల మిస్టరీ ఇప్పటికి ఎవరికి అంతు చిక్కలేదు. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ స్థంభం క్రింద క్లాత్ ను కానీ, పేపర్ ను పెట్టవచ్చు. స్థంభానికి  ఫ్లోర్ కి మధ్య ఉండటమే దీనికి కారణం. స్తంభం ఫ్లోర్ ను తాకకుండా గుడిని ఎలా మోస్తోంది అనే విషయం మిస్టరీగా మిగిలింది.
2. యాగంటి:

ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రసిద్ధ క్షేత్రం అయిన యాంగటి మిస్టరీ ఆలయంగా ఉంది.  ఇక్కడ ఉన్న నంది విగ్రహం మొదట్లో చిన్నగా ఉండేదని,  రాను రాను పెరుగుతూతు వచ్చిందని స్థానికులు అంటుంటారు. దీనిపై ఎన్నో పరిశోధనలు జరిపిన సైంటిస్టులు ఈ రాయికి పెరిగే స్వభావం కలదని, దానివల్లే ప్రతి ఇరవై సంవత్సరాలకు ఇంచు   పెరుగుతుందని వెల్లడించారు. కానీ భక్తులు మాత్రం ఇది శంకరుడి లీల అని, యుగాంతం వచ్చినపుడు ఆ నంది నిలబడి రంకెలేస్తుందని విశ్వసిస్తుంటారు.
3. శని శింగనాపూర్:

మహారాష్ట్రలో శని శింగనాపూర్ గ్రామంలో ఉండే ఇళ్లకు తలుపులు ఉండవు. అక్కడ ఇప్పటివరకు ఒక్క దొంగతనం జరిగిన సంఘటన కూడా లేదని స్థానికులు చెప్తుంటారు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తే వారిని ఆ శనిదేవుడు శిక్షిస్తాడని విశ్వసిస్తారు. అక్కడ ఇళ్లకు మాత్రమే కాకుండా బ్యాంకులకు తాళాలు వేయరంట.
4. షోలాపూర్:

మహారాష్ట్రలోని షోలాపూర్ లో ‘షెత్పల్’ అనే  వింత గ్రామం ఉంది. ఈ గ్రామంలో అందరు పాములను పూజిస్తుంటారు. అంతే కాకుండా ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఓ గదిని పాముల కోసం కేటాయిస్తారట. ఇంట్లోని మనుషుల్లానే పాములు తిరుగుతూంటాయి. అయితే ఆ గ్రామంలో ఇప్పటివరకూ ఒక్కరిని కూడా పాము కరవలేదని స్థానికులు చెబుతున్నారు.
5. అమ్రోహా:

ఉత్తరప్రదేశ్ లోని పుణ్యక్షేత్రం ‘అమ్రోహా ‘చుట్టూ తేళ్ళు కాపలాగా ఉంటాయి. ఈ ఆలయం లోపల, ఆలయం చుట్టూ కూడా  తేళ్ళు తిరుగుతూంటాయి. అయితే ఆ తేళ్ళు అక్కడకి వచ్చే భక్తులను కుట్టవు. ఆ తేళ్లను భక్తులు కూడా  పట్టుకుంటారంట.
6. గురుద్వార్:

గురుద్వార్ పంజాబ్ రాష్ట్రంలో వుంది. ఈ గురుద్వార్ లో ఒక మామిడి చెట్టు కలదు. మామిడికాయలు సాధారణంగా వేసవి కాలంలో కాస్తాయి. అయితే ఇక్కడ ఉన్న మామిడిచెట్టు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ప్రతీరోజూ కాస్తూనే వుంటాయి. ఇది ఇప్పటికి మిస్టరీగానే ఉంది.
7. దార్వేష్ దర్గా:

పూణే లో ఉన్న దార్వేష్ దర్గాలో  90కేజీల రాయి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక్కడ  పదకొండుమంది కలిసి ఒక్క వేలు  సహాయంతో ఒక రాయిని పైనకి లేపాలి. ఆ రాయిని కూడా ‘హజరత్ కమార్ అలీదర్వేష్’ అని అంటూ పైకి లేపాలి. ఇలా చేయగానే ఆ రాయి పది నుండి పది అడుగుల ఎత్తుకి వెళ్లి, గాలిలో తేలుతూ అలాగే వుంటుంది. ఇది ఎలా, ఎందుకు జరుగుతుందనేది ఇప్పటికి తెలీదు.8. తంజావూరు బృహదీశ్వరాలయం:

తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని 11 వ శతాబ్దంలో రాజరాజచోళుడు నిర్మించాడు. ఈ ఆలయంలో మిస్టరీ ఉంది. అది ఏమిటంటే ఈ ఆలయంలోని నీడ. ఈ ఆలయం యొక్క నీడలు కనిపించవు. ఏడాది పొడుగునా ఎప్పుడు  చూసినా కూడా సాయంత్రం సమయంలో ఆ దేవాలయం నీడలు నేల మీద పడవు. ఇది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అంతే కాకుండా ఆ ఆలయా నిర్మాణానికి వాడిన గ్రానైట్ ను ఎక్కడ నుండి తెప్పించారనేది కూడా ఎవరికి తెలియదు.9. పూరీజగన్నాథ్ ఆలయం:

పూరీజగన్నాథ్ ఆలయంలో అనేక రహస్యాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ఏమిటంటే ఆలయం యొక్క సింహ ద్వారం వరకూ వినిపించే సముద్రఘోష. సింహ ద్వారం దాటి లోపలికి వెళ్తే వినిపించదు. మరి దాని వెనుక ఉన్న సాంకేతికత ఏమిటి అనేది ఇప్పటికి అంతు చిక్కలేదు.
10. కబీస్ బాబా ఆలయం:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీతాపూర్ జిల్లాలో ఉండే కబీస్ బాబా ఆలయం ఎంతో విచిత్రం అయినది. ఇది దేవుడు లేని  ఆలయం. ఇక్కడ విగ్రహం వుండదు. అలాగే పూజారి వుండడు. దీనిని 150 సంవత్సరాల క్రితం నిర్మించారని స్థానికులు చెపుతున్నారు. అయితే ఒక శివభక్తుడు అయిన కబీస్ బాబా వుంటారు. కబీస్ బాబా భక్తులు సాయంత్రం సమయంలో సమర్పించే మద్యం సేవించి, వారి అనారోగ్య సమస్యలను పోగొడతాడని విశ్వసిస్తుంటారు.

Also Read: ఇంటి ముందు కాకి పదే పదే అరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

 


End of Article

You may also like